ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా 27 మంది నిరుపేదలకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమం లో తాత్విక బాల వికాస్ ద్వారా శిక్షణ పొందిన 17 మంది చిన్నారులు చక్కటి ప్రసంగాలు చేసినారు.

వై.ఎస్.అర్.పి రాష్ట్ర నాయకులు శ్రీ వడిశెట్టి నారాయణ రెడ్డి, శ్రీ పెనుమల్లు సుబ్బిరెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. శ్రీ వడిశెట్టి నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ మతాతీత జ్ఞాన చైతన్యము ద్వారా వసుదైక కుటుంబమును, ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా మానవ సేవయే మాధవ సేవ అని అనేక కార్యక్రమాలు నిర్వహించి, త్రయీ సాధన ద్వారా మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది అని అన్నారు.

You may also like...