Guru Pournami Sabha | గురుపౌర్ణమి సభ | 10th July 2025
The head of the Peetham, Dr. Umar Alisha Swami, gave a blessing speech saying that the members are being made into sadhaks through the three practices. During the auspicious period of Guru Pournami, as part of the ‘My Plant, My Breath’ program, everyone should plant 3 saplings and take care of them, which is Guru Dakshina. Due to the loss of spirituality, intolerance and unrest are increasing, and human genocide is being created. Therefore, he taught that everyone can take refuge in a known Sadguru and experience that humanity is Godhood and that human service is Madhava service by lighting the light of knowledge. He said that through spirituality, one can cultivate hope and patience and achieve a happy life.
The main organizer of Sri Vijaya Durga Peetha, famous Panchanga Karta Sri Banala Durga Prasad, honored the head of the Peetha, Dr. Umar Alisha Swami, with garlands. During the auspicious time of Guru Pournami, Peethadhipathi Dr. Umar Alisha Swami taught Mahamantra to 126 people.
During the auspicious time of Guru Pournami Thursday, thousands of members performed Pada Puja with rose petals at the feet of Swami and received the blessings of Sadguru. Geetaavadhani and Ashtavadhani Sri Yerramsetty Umamaheswara Rao conducted the Pada Puja commentary programs. Dr. Narayana wrote the interpretations of 1000 poems in the history book of Sri Mohammed Rasool, written by the 6th Peethadhipathi Kavi Shekhara Dr. Umar Alisha Swami, in the form of a miniature book. This book was launched by Sadguru and copies of them were presented to the Guru’s brothers Ahmed Alisha and Peetha Convener Sri Peruri Suribabu.
Pithapuram Municipal Commissioner Sri N. Kanaka Rao, retired IAS Sri Dasari Srinivas, Sri Marreddy Srinivas, Jana Sena Pithapuram Constituency In-charge, Shanti Ashram Administrator Sri Nallam Satyanarayana, retired RTO Sri Ramachandra Rao and others participated in this program.
త్రయీసాధన ద్వారా సభ్యులను సాధకులుగా తీర్చిదిద్దుతున్నామని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. గురుపౌర్ణమి పుణ్య కాలంలో ‘నా మొక్క నా శ్వాస’ కార్యక్రమంలో భాగంగా ప్రతీ ఒక్కరూ 3 మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని, అదే గురు దక్షిణ అని పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణ చేశారు. ఆధ్యాత్మికత కోల్పోవడం వల్ల అసహనం, అశాంతి పెరిగి, మానవ మారణహోమం సృష్టింపబడుచున్నది. కావున ప్రతీ ఒక్కరూ తెలిసిన సద్గురువును ఆశ్రయించి, జ్ఞానజ్యోతిని వెలిగించుట ద్వారా మానవత్వం ఈశ్వరత్వం అని, మానవ సేవే మాధవ సేవ అని అనుభవంలో గ్రహించవచ్చని బోధించారు. ఆధ్యాత్మికత ద్వారా నిరీక్షణ, సహనం అలవడి జీవన తత్త్వం సుఖమయం చేసుకోవచ్చని అన్నారు.
శ్రీ విజయ దుర్గా పీఠం ప్రధాన నిర్వాహకులు, ప్రముఖ పంచాంగ కర్త శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ గారు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారిని గజమాలతో సత్కరించారు. గురు పౌర్ణమి పుణ్య కాలంలో 126 మందికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామివారు మహామంత్రం ఉపదేశించారు.
గురు పౌర్ణమి గురువారం పుణ్య కాలంలో వేలాది మంది సభ్యులు స్వామివారి పాద పద్మములకు గులాబీ రేకలతో పాదపూజ చేసి, సద్గురు తేజస్సును ఆశీస్సుల రూపంలో పొందారు. గీతావధాని, అష్టావధాని శ్రీ యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు పాద పూజా వ్యాఖ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. 6వ పీఠాధిపతి కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామివారి చేత రచింపబడిన శ్రీ మహమ్మద్ రసూల్ వారి చరిత్ర గ్రంథంలో ఉన్న 1000 పద్యాలకు సూక్ష్మ గ్రంథ రూపంలో డా. నారాయణ గారు తాత్పర్యములు వ్రాసారు. ఈ గ్రంథమును సద్గురువర్యులు ఆవిష్కరణ చేసి, వాటి ప్రతులను గురువుగారి సోదరులు అహ్మద్ అలీషావారికి, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబుగారికి అందచేశారు.
ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎన్. కనకారావు, రిటైర్డ్ ఐ.ఎ.ఎస్. శ్రీ దాసరి శ్రీనివాస్ గారు, శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇంఛార్జి, శాంతి ఆశ్రమం నిర్వాహకులు శ్రీ నల్లం సత్యనారాయణ, రిటైర్డ్ ఆర్.టి.వో శ్రీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.