79th Independence day celebrations at RRBHR School and Jr. College

August 15 is Independence Day, a festival celebrated regardless of castes, religions and ethnicities. Without any illusions, you should study, adorn high positions and bring glory to your families, your teachers and our country, said the head of the SVVVAP, Dr. Umar Alisha Sadguruvaryulu. He said that the parents who gave birth and the teachers who teach should be considered as living gods. R.R.B.H.R. High School, R.R.B.H.R. Junior College, the head of the SVVVAP, Dr. Umar Alisha Sadguruvaryulu participated as the chief guest and unfurled the flag. Former MLA Sri S.V.S.N. Verma, School Head Master Sri Rama Krishna, Junior College Principal Dr. Kesava Rao, TDP Councilors and others participated in this program. Several councilors, faculty, staff, and the brothers of the dean, Dr. Umar Alisha, Mehboob Pasha, Ahmed Alisha, and Kabir Shah, also participated in the program.

కులాలకు, మతాలకు, జాతులకు అతీతంగా జరుపుకునే పండుగ ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం అని, ఎటువంటి భ్రాంతికి లోను కాకుండా విద్యాభ్యాసం చేసి, ఉన్నత పదవులను అలంకరించి, మీ కుటుంబాలకు, మీ టీచర్లకు, మన దేశానికి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, విద్య నేర్పే గురువులను ప్రత్యక్ష దైవంగా భావించాలని అన్నారు. ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. హై స్కూల్, ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. జూనియర్ కళాశాల ఆవరణల్లో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ రామ కృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కేశవరావు, టి.డి.పి. కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్స్, అధ్యాపకులు, సిబ్బంది, పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషావారి సోదరులు మెహబూబ్ పాషా, అహమ్మద్ ఆలీషా, కబీర్ షా కూడా పాల్గొన్నారు.

You may also like...