Madras University – International literary conference
మద్రాసు విశ్వవిద్యాలయం – అంతర్జాతీయ సాహితీ సదస్సు
బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీ షా సాహిత్యం – బహుముఖీనత

మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం వారి ఆధ్వర్యవంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం వారి సౌజన్యంతో “బ్రహ్మర్షి డాక్టర్ ఉమర్ ఆలీ షా సాహిత్యం – బహుముఖీనత” అనే విషయం పై జనవరి 27, 28 తేదీలలో రెండు రోజుల అంతర్జాతీయ సాహితీ సదస్సు మద్రాసులోని మెరీనా ఆవరణలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయినది. ప్రారంభ కార్యక్రమానికి పీఠం నవమ పీఠాధిపతి శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా వారు, మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అధిపతి శ్రీ విస్తాలి శంకర్ రావు, ప్రముఖ సాహిత్య విమర్శకులు, తెలుగు అకాడమీ పూర్వ డైరెక్టర్ సి.హెచ్. సుశీలమ్మ, యోగాలయ హైదరాబాద్ వ్యవస్థాపకులు విశ్వార్షి వాసిలి వసంత కుమార్, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ తెలుగు విభాధిపతి షేక్ మస్తాన్, హైదరాబాద్ సిటీ కాలేజీ తెలుగు ఉపన్యాసకులు శ్రీ కోయి కోటేశ్వర రావు, జననీ సంస్థ చెన్నై అధ్యక్షులు గుడిమెట్ల చెన్నయ్య గారు విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఈ సభలో వక్తలు బ్రహ్మర్షి ఉమర్ ఆలీ షా మహాకవిగారు వ్రాసిన గ్రంథాలలోని తెలుగు సాహిత్యం నవల, నాటిక, పద్య కావ్యాలలోని స్త్రీ పాత్రల ఔన్నత్యము, దేశభక్తి, సమాజ సంస్కరణలు వంటి అంశాలలోని విశిష్టతను గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 66మంది తెలుగు కవులు ఉపాధ్యాయులు, భాషా పండితులు, ఉమర్ ఆలీషా వారి సాహిత్యం పై వ్రాసి, పత్ర సమర్పణ గావించిన వ్యాసాలను ప్రచురించిన ప్రత్యేక సంచిక మూసి పత్రికను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా వారు ఆవిష్కరణ చేసారు. వ్యాసాలలోని నాలుగు ఉత్తమ వ్యాసాలకు వెయ్యి రూపాయలు చొప్పున బహుమతులను అందచేసారు. తదనంతరం పత్ర సమర్పకులు తాము వ్రాసిన వ్యాసాలలోని సారాంశంలోని విషయాలను ఐదు సమావేశాలలో ప్రసంగాల ద్వారా అందచేసారు.
ఈ కార్యక్రమంలో ప్రతీ సమావేశానికి అధ్యక్షులుగా వ్యవహరించిన శ్రీమతి స్వరాజ్య లక్ష్మిగారు, ఈ. ఎస్.ఆర్ శర్మ గారు, ఎలిజబెత్ కుమారిగారు చక్కటి సాహిత్య విశ్లేషణల ద్వారా సమావేశాలను ముగించారు.