ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యులు అనుగ్రహభాషణ చేసినారు. శ్రీ మద్దాల శంకరనారాయణ, శ్రీమతి దుర్గావల్లి దంపతులు స్వామిని శాలువాతో సత్కరించారు. సినీ గేయ రచయిత, కవి శ్రీ రసరాజు గారు, న్యాయవాదుల గుమాస్తాల రాష్ట్ర సంఘ అధ్యక్షులు శ్రీ కటకం కృష్ణమూర్తి గారు, తణుకు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి వంకా రాజకుమారి గారు, శ్రీ పసుపులేటి ప్రసాద్, శ్రీమతి లక్ష్మి గార్ల సౌజన్యంతో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సామాజిక కార్యక్రమాలలో భాగంగా నిరుపేద మహిళలకు రగ్గులు పంపిణీ చేశారు. శ్రీ బెల్లపుకొండ శ్రీను, శ్రీమతి మంగతాయారు గార్ల సౌజన్యంతో మొక్కల పంపిణీ చేశారు. కార్యకర్తలకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి మొక్కలు పంపిణీ చేసినారు. పీఠాధిపతి డా. ఉమర్ అలీషా స్వామి వార్ని శ్రీనివాస రాజు గారు, కువైట్ దర్శించుకొన్నారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.

02-SVVVAP-JnanaChaitanyaSadhasu-Tanuku-09122019

03-SVVVAP-JnanaChaitanyaSadhasu-Tanuku-09122019

 

పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యుల అనుగ్రహభాషణ

 

You may also like...