9-9-2015 Brahmarshi Hussain Shah sathguru 110th birthday celebrations

Brahmarshi Hussain Shah sathguru 110th birthday celebrations held at Pithapuram New Ashram premises on Wednesday,9-Sep-2015, from 09:00- 12:30pm IST.

Part 1/2


Part 2/2


Photo Gallery

[Not a valid template]


ఆధ్యాత్మిక తాత్వికజ్ఞానం – మహామంత్ర మననం

మహామంత్ర మననం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ముక్తి పొంది తరించాలని  పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. 9-9-2015 బుధవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠo నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేయబడిన 110 వ అవతారి శ్రీ హుస్సేన్ షా సధ్గురువర్యుల జన్మదినోత్సవం  సభకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అధ్యక్షత వచించగా కాకినాడ M.P. శ్రీ తోట నరసింహం , JNTU(K), వైస్ చాన్సిలెర్ డాక్టర్ VSS కుమార్ గారు ముఖ్య అతిధిగానూ, JNTU(K) డైరెక్టర్ డాక్టర్ K.పద్మరాజు, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ చైర్మన్ శ్రీ బి. తిరుపతి రాజు, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబెర్ శ్రీ త్రిపాఠి గార్లు అతిధులుగా  చిలుకూరి సేవాసమితి , రామచంద్రపురం అధ్యక్షులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ (అలయన్స్ ZC) ఈశ్వర్ కుమార్ , సామర్లకోట వచ్చి ప్రసింగిచారు.

స్వామి ప్రసంగం:

ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం, మహామంత్ర మననం ద్వారా శారీరక ఆరోగ్యం , మానసిక ఆరోగ్యం పొందడమే కాక మనవ ఆత్మ జ్ఞానిగా పరిణామo చెంది ముక్తిని పొందగలడని డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. మంత్ర స్వరూపమే గురు స్వరూపము , గురు స్వరూపమే  మహామంత్ర స్వరూపంగా మహా మంత్ర మననం చేయడం ద్వారా జీవానువులలో జీవ చైతన్య శక్తి మేల్కొకొల్పి మోక్షాన్ని పొందే విషయo మానవుడు అనుభవరూపంలో గ్రహించగలుగుచున్నాడని డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు.

మానవ సేవయే మాధవ సేవగా ఒక్కొక్కరూఒక్కక్క మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. 

  • జ్యోతి ప్రజ్వలన : పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు జ్యోతి ప్రజ్వలన చేసారు
  • శ్రీ S.ఉమేష్ , హైదరాబాద్ : అవతారి శ్రీ హుస్సేన్ షా సధ్గురువర్యులకు శిష్యులను భౌతికంగాను , అభౌతికంగాను కాపాడిన విధానమును సభకు వివరించారు.
  • కుమారి N.షర్మిలా ప్రియాంక, తుని : అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులచే రచింపబడిన “తల్లి తండ్రులు” అనే అంశంఫై ప్రసంగగించారు.
  • కుమారి N.ఉమా శ్రీలక్ష్మి , కాకినాడ: మానవుడు ఈశ్వరునిగా పరిణామం చెందు మార్గాన్ని సభకు వివరించింది.
  • సంగీత విభావరి : ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ ఏడిద సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో చిన్నారులు పాడిన కీర్తనలు సభికులను అలరింప చేసినవి. కుమారి స్వాతి , అనిశెట్టి ఉమ, K.ఉమ కీర్తనలు పాడారు.
  • శ్రీ నేరెళ్ల కృష్ణమూర్తి , రాజమండ్రి: మంత్ర పుష్పం విశిష్టతను సభకు వివరించిరి.ఈశ్వరునియొక్క సూక్ష్మ రూపం మానవుడు, మానవుని యొక్క విశాల రూపం ఈశ్వరుడు అన్నారు.
  • శ్రీ S.L.K. ప్రసాదరావు, హైదరాబాద్: గురుని గ్రహించి, గురు ప్రభోధిత జ్ఞానం పొంది మానవ జన్మ సార్ధక్య పరుచుకోవాలని చెబుతూ అవతారి శిష్యులకు దాని అవినాభావ సంబంధం సభకు వివరించారు.
  • K. పద్మరాజు, Director academical planning, JNTU, Kakinada: వ్యక్తిగత సామరస్యత, కుటుంబ సామరస్యత, సామాజిక సామరస్యత, జాతీయ సామరస్యత , అంతర్జాతీయ సామరస్యతకు దారి తీసే విధానంగా వారు చేసేన ఆధ్యాత్మిక , సామాజిక సేవలు మహోన్నత మైనవని అని అన్నారు.
  • V.S.S. కుమార్, వైస్ చాన్సలర్ : [ JNTU, kkd ] దేశానికి సేవచేసే ఉమర్ అలిశాగారు ధవ్యసమానులు తెలిసో, తెలియకో అనేక తప్పులు చేస్తాం. వీరిని దర్శించుకొని బ్రాంతి భావాలు తోలిగించుకోవాలన్నారు.
  • రామప్రసాద్ గారు, రావులపాలెం :   మహామంత్ర ప్రబోధ సమయంలో గురువు, శిష్యుని ఉద్దేశించి మాట్లాడుతూ “ నీవు గురువంతటివాడిగా పరిణామం చెందితే సంతోషిస్తాను” అన్నారని అన్నారు.
  • కుట్టు మిషన్ పంపిణి : ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళ అమీనా సుల్తానకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారు , వైస్ చాన్సలర్ డాక్టర్ VSS కుమార్ గారు , డాక్టర్ పద్మ రాజు గారు అంద చేసారు
  • తోట నరసింహం గారు ( M.P. కాకినాడ) , ప్రసంగం:

2004 నుండి 2015 వరకు రెండు సార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా , నేడు పార్లమెంట్ మెంబెర్ గా, లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఎన్నో , ఎన్నెన్నో అవకాశాలు కల్పించి ఆశీర్వదిస్తున్న డాక్టర్ ఉమర్ ఆలీషా గారికి నా ధన్యవాదాలు. కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలీషా గారి కాంస్య విగ్రహాన్ని కాకినాడ నడిబొడ్డున బోట్ క్లబ్ ఆవరణలో ఆదివారం నెలకొల్పిన సమయంలో కవిశేఖర డాక్టర్ ఉమర్ఆలీషా  గారు వర్షింప చేసి రైతులను ఆనందింప చేసారు అని కొనియాడారు. MakeVizag Green , Make Kakinada Green వంటి కార్యక్రమాలతో పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారని ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గారిని కొనియాడారు. అనంతరం సభ్యులకు మొక్కలను పంపిణి చేసారు.

                ఈ మొక్కల పంపణీ కార్యక్రమంలో:

అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ చైర్మన్ శ్రీ.బి.తిరుపతి రాజు గారు , అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంబర్ శ్రీ త్రిపాఠి గరు , చిలుకూరి సేవాసమితి , రామచంద్రపురం అధ్యక్షులు చిలుకూరి వీర వెంకట సత్యనారాయణ (సామర్ల కోట లయన్స్ క్లబ్ Z.C) ఈశ్వర్ కుమార్ పాల్గొన్నారు.


Print Media Coverage

[Not a valid template]


Follow us on Facebook

You may also like...