79th Independence day celebrations at Umar Alisha Public School
15-Aug-2025: On the occasion of the 79th Independence Day celebrations, the school correspondent Mr. Hussain Shah presided over the program organized in the premises of Umar Alisha Public School, while his wife Apshan and daughter Fatemun Johara also participated and spoke. In the independent India that was achieved as a result of the sacrifices of many great people, everyone should work hard and make our country a developed country, said the head of the SVVVAP, Dr. Umar Alisha Sadguru. The head of the SVVVAP, brothers Mehboob Pasha, Ahmed Alisha, Kabir Shah, and school principal Shah Jahan decorated the stage and spoke. The cultural programs performed by the students entertained the audience. On this occasion, the school management distributed sweets to the students.






79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా అధ్యక్షత వహించగా, వారి శ్రీమతి అప్షాన్, కుమార్తె ఫాతిమున్ జొహారా కూడా పాల్గొని ప్రసంగించారు. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర భారత దేశంలో ప్రతీ ఒక్కరూ కృషి చేసి మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అన్నారు. పీఠాధిపతి సోదరులు మెహబూబ్ పాషా, అహ్మద్ ఆలీషా, కబీర్ షా, స్కూల్ ప్రిన్సిపాల్ షాజహాన్ వేదికను అలంకరించి ప్రసంగించారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం స్వీట్స్ పంపిణీ చేశారు.