HussainSha Puraskaram 2025

ఆచార్య గోరుగొంతు అక్కుభొట్లు శర్మ మరియు విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావు వారలకు హుస్సేన్ షా స్మారక పురస్కారం అందజేత

కవిశేఖర డా॥ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా అందిస్తున్న హుస్సేన్ షా కవి స్మారక సాహితీ పురస్కారాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత సంస్కృత విభాగాధిపతి ఆచార్య గోరుగొంతు అక్కుభొట్లు శర్మగారికి మరియు నాగులాపల్లికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు చింతపల్లి అప్పారావుగారలకు సంయుక్తంగా అందజేశారు. వీరికి పురస్కారంతో పాటుగా ఒక్కొక్కరికీ 25 వేల నూట పదహారు రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందజేశారు. ఉమర్ ఆలీషా సాహితీ సమితి ద్వారా భీమవరంలో 35 సంవత్సరాలుగా విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తూ, సాహితీ సేవ చేస్తున్న సమితి సభ్యులను పీఠాధిపతి ఈ సందర్భంగా అభినందించారు.

అనంతరం పురస్కార గ్రహీత శ్రీ చింతపల్లి అప్పారావుగారు మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అక్షరజ్యోతి కార్యక్రమం నిర్వహించిన సేవాఫలంగానే ఈ పురస్కారం లభించిందని అన్నారు. అంతర్జాతీయంగా ఆధ్యాత్మిక సాహిత్య సేవా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తి పీఠాధిపతి ఉమర్ ఆలీషా అని వెల్లడించారు. మానవాళికి మార్గదర్శనంగా నిలుస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని పేర్కొన్నారు.

You may also like...