95th Annual Congregation | MahaSabhalu – 09th Feb 2023 – Day 1

9th Feb 2023 – MahaSabha Day 1 – 9-ఫిబ్రవరి -2023 వార్షిక మహాసభ – మొదటి రోజు

95వ వార్షిక జ్ఞాన మహా సభలు ఫిబ్రవరి 9, 2023

జ్ఞాన నేత్రం ద్వారా భగవంతుడిని దర్శించ వచ్చు.

………..పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా

మానవుడు తనలో అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రాన్ని గుర్తించగలిగితే తద్వారా భగవంతుడిని దర్శించవచ్చునని పీఠా ధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పిఠాపురం – కాకినాడ రోడ్ నందలి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో 3 రోజులు పాటు జరిగే పీఠం 95వ వార్షిక మహా జ్ఞాన సభలు గురువారం ప్రారంభమయ్యాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో పీఠాధిపతి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలీషా మాట్లాడుతూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలతో కూడిన అరిషడ్వర్గాల వలన మానవుడు బ్రాంతి శక్తులకు లోబడుతున్నాడని అన్నారు. బ్రాంతి వలన కష్టాలను అనుభవించ డానికి మానవుడు ఇష్ట పడడని అందువల్లే తన కష్టాలు తీర్చమని స్వామీజీలను గురువులను దర్శిస్తూ ఉంటాడని పేర్కొన్నారు. కష్టాన్ని ఇష్టపడి స్వీకరిస్తే బ్రాంతి శక్తి తొలగిపోతుందని తెలిపారు. తాత్విక జ్ఞానం పొందడం ద్వారా అంతర్లీనంగా ఉన్న జ్ఞాన నేత్రం తెరువబడుతుందని వెల్లడించారు. మానవుడిని మహనీయుడిగా మలిచే జ్ఞాననేత్రం పొందడానికి గురుముఖంగా ఆధ్యాత్మిక తాత్వాన్ని గ్రహించాలని తెలిపారు.

వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక తత్వ ప్రభోదం, సామాజిక సేవలను నిర్వహిస్తూ మతసామరస్య సదస్సులతో మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు.

అనంతరం నివేదిక 2023 మరియు వేదాంతం నుండి జాతీయతా భావం వైపు గ్రంధాన్ని పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు

సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఠా పురం శాసన సభ్యుడు పెండెం దొరబాబు మాట్లాడుతూ వందలాది సంవత్సరాలు గా ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని శిష్యు లకు బోధిస్తూ విశ్వమానవ శ్రేయస్సుకై పాటుపడుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అని అన్నారు. గురు శిష్యుల సంబంధం అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నదని తెలిపారు. నమ్మిన గురువుతో పరిపూర్ణమైన ప్రయా ణం చేస్తే శిష్యుని జీవితం సార్ధకమౌతుంద ని, వెల్లడించారు. పీఠం విశిష్టతను మారు మూల పల్లెలవరకూ విస్తరింప చేసేలా శిష్యులు కృషి చేయాలని సూచించారు. ఆధ్యాత్మిక, మరియు సేవా నేత్రాలతో పీఠాధిపతి ఉమర్ ఆలీషా చేస్తున్న సేవ లను కొనియాడారు.

తానా చైర్మన్ తోటకూర ఈశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారం కోసం అనునిత్యం కృషి చేస్తున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం
అని అన్నారు. స్త్రీ సంక్షేమం, సర్వమత సౌభ్రాతృత్వం కొరకు పీఠాధిపతులు చేస్తున్న కృషిని కొనియాడారు. అసమా నతలు లేని సమ సమాజాన్ని నిర్మించ డానికి పాటుపడుతున్న పీఠాన్ని దర్శించ డం, తన పూర్వజన్మ సుకృతమని అన్నారు.

అనంతరం పీఠం సభ్యులు షాన్ వాజ్, పింగళి ఆనంద్, వేణుగోపాల శర్మ, టి. సాయి వెంకన్న బాబు, పేరూరి కోమలి, సూర్యలత, స్వర్ణలత, కె. సతీష్, సత్యవోలు ఉమేష్, ఎన్. రామ్ గోపాల్ వర్మ, ఉమామహేశ్వరి, జ్యోతి తదితరులు సభలో ప్రసంగిస్తూ మానవునిలోని కలి కల్మష్మాలను, జడ కాలుష్యాలను తొలగించి అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని వెలికితీయడమే పీఠం తత్వమని తెలి పారు. ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించడం ద్వారా మానవుడు తన జీవనయానంలో ఎదురుయ్యే అశాంతి, ఆందోళన, వత్తిడి వంటి వాటినుండి విముక్తి పొందవచ్చునని అన్నారు.

ఈ సందర్బంగా పిఠాపురం మున్సిపల్ చైర్మన్ గండేపల్లి బాబి, వైస్ చైర్మన్ కొత్త పల్లి బుజ్జి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ వర్ధినీడి సుజాత పట్టణ ఎస్.ఐ. జగన్మో హన్ రావు, అగ్నిమాపక అధికారి ఎ.వేణు, శ్రీపాద వల్లభ సంస్థానం దేవాల యం చైర్మన్ రెడ్డెం జనార్దన రావు, వైసిపి పట్టణ అధ్యక్షుడు బొజ్జా రామయ్య, వైసీపీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ ప్రసాద్, జనసేన నేత పిల్లా శ్రీధర్ తదిత రులు పీఠాధిపతిని దర్శించుకున్నారు.

ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాలకేంద్రం, శిశు సంరక్షణా కేంద్రాలను,ప్రాధమిక వైద్య శిబిరాలతో పాటుగా 27 కేంద్రాలను ఏర్పాటు చేసారు.

సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎ. ఉమ ఆలపించిన కీర్తనలు సభి కులను రంజింపచేసాయి. సభలో పాల్గొన డానికి దేశ, విదేశాలనుండి విచ్చేసిన
సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 342 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు.

మొదటి రోజు – సాంస్కృతిక కార్యక్రమాలు

మొదటి రోజు – యువ చైతన్య వికాస్

News

https://www.etvbharat.com/telugu/andhra-pradesh/state/kakinada/annual-mahasabhas-of-sri-viswa-viznana-vidya-aadhyatmika-peetham/ap20230209194737679679227

News Paper

You may also like...