ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది
ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది. సభలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ రెడ్డప్ప ధవేజీ గారు, ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఉపాధ్యక్షులు శ్రీ టి.మురళీకృష్ణ గారు, ఆశ్రమ నిర్వాహకులు శ్రీమతి రుద్రరాజు విజయ గారు, పెనుగొండ డిగ్రీ కాలేజీ తెలుగు రీడర్ శ్రీ రంకిరెడ్డి రామమోహనరావు గారు, మెడికల్ ప్రాక్టీషనర్ శ్రీ సుబ్బరాజు గారు ప్రసంగించారు. నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహభాషణ చేశారు. స్వామిని శ్రీ రుద్రరాజు ఇనకరాజు శ్రీమతి విజయ దంపతులు దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు అనేక గ్రామాల నుండి వచ్చిన సభ్యులు స్వామిని దర్శించి శుభాశీస్సులు పొందారు.