ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 171| 26th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 171

వక్తలు :

  1. శ్రీ యిర్రి నాగ సూర్య ప్రసాద్, అత్తిలి
  2. శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి, కాలిఫోర్నియా

351 వ పద్యము
మ. తరుగన్నేరని బ్రహ్మతేజ మెద నుద్యల్లీల నిండార మ
త్సరమాయాతమ మంతరింపఁ దపమున్ సాగించి యీరేడు లో
క రహస్యంబులు గాంచునట్టి సుగుణాకారైక తేజస్వి కీ
యిరులన్ గాటుగ పట్టియున్న తెరయడ్డేయడ్డ దేనాఁటికిన్.

352 వ పద్యము
చ.‌ సహజములౌ జరామరణ సంగతముల్ భవదుఃఖ మిశ్రితా
వహ మిహజీవితంబున శుభంబులకై వగఁ జెందుకంటె త
ద్రహిత నిషిద్ధ భాజనపరంపరలన్ ముద మొందువారికే
మహిత సుఖానుభూతి యమృతత్వము జిక్కును మాట లేటికిన్.

You may also like...