ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 205| 20th December 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 205
వక్తలు :
- శ్రీ పెనుమల్లు వెంకట రామారెడ్డి, విశాఖపట్నం
- శ్రీమతి యిర్రి ఉమా పద్మ, అత్తిలి
420 వ పద్యం
ఉ. చావును పుట్టుకన్ గలుగు సత్యము నేరును చెప్పలేరె యీ
చావును కాలవాహిని వెసన్ గలిగించుచు నున్న మార్పు జీ
వావసథంబు యోజన శతాధికమై భయదంబుఁ గూర్చు నీ
తావు రథాంగమట్లు నిరతంబుఁ బరిభ్రమణంబుఁ గాంచెడున్.
421 వ పద్యం
శా. ఏదో దారిని త్రొక్కిపొమ్ము తుద కేదేదో తటస్థించు నా
మోదంబో వ్యసనంబొ దానికయి నీ బుద్ధిన్ వితర్కింప కా
పాదింపంబడు నెల్ల యేవిధమునో వచ్చున్ బ్రయత్నించితే
రా దీ యర్థము కర్మబద్ధము ఘటప్రారబ్ధ మీ భోగముల్.
