12 న సెప్టెంబర్ 2024 తేదీన కాకినాడ తిరుమల హాస్పిటల్ ఆవరణ లో ఏర్పాటు చేసిన హేరంబ గణపతి ని సందర్శించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు
Press note Kakinada APSP 12-9-24
నేపాలీ సంప్రదాయం లో రూపుదిద్దుకున్న హేరంబ గణపతి ఆశీస్సులతో డా. గౌరీ శేఖర్ గారి వద్దకు వచ్చు రోగులకు ఆధ్యాత్మిక చికిత్స జరుగుతోందని డా. గౌరీ శేఖర్ గార్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అభినందించారు. కాకినాడ APSP వద్ద గల తిరుమల హాస్పిటల్ ఆవరణ లో ఏర్పాటు చేసిన హేరంబ గణపతి ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి దర్శించి అనుగ్రహ భాషణ చేశారు. రోగులకు వైద్య సేవలే కాకుండా ఆధ్యాత్మిక సేవలు అందించుట అభినందనీయం అన్నారు. మానవాళి చేపట్టే కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా నిర్వహింప బడాలంటే గణపతి ని పూజించాలని డా. ఉమర్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, మాజీ సర్పంచ్ శ్రీ ఆడబాల రత్న ప్రసాద్, శ్రీ రాజా తదితరులు పాల్గొన్నారు. హేరంబ గణపతి ఛాయా చిత్రాన్ని డా. అలీషా గార్కి డా. గౌరీ శేఖర్ బహుకరించారు. అనంతరం డా గౌరీ శేఖర్ గారు గారాబంగా పెంచుకుంటున్న గోవులకు డా . ఉమర్ ఆలీషా ఆహారం అంద చేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్,
9848921798.