Reopening of reconstructed T.Timmapuram and H.Kothuru Ashrams on 27th October 2023

T. తిమ్మాపురం మరియు H. కొత్తూరు గ్రామాలలో ఆశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొని, కాల పరీక్షను తట్టుకునేలా చేసేదే ఆధ్యాత్మిక తత్వమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం ఉదయం తుని మండలం T. తిమ్మాపురం గ్రామం లో పునర్మించిన ఆశ్రమాన్ని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. అనంతరం కొత్తూరు గ్రామంలో కూడా నూతన ఆశ్రమాన్ని ఆవిష్కరించారు.ఈ రెండు కార్యక్రమాలలో ఆశ్రమ నిర్మాణం లో గ్రామ సభ్యులందరూ పాల్గొన్నారు. ఆశ్రమ ఆవరణ లో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా 3 మొక్కలు నాటారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకొనుట ద్వారా జీవన తత్వం సుఖ సంతోషాలతో, తృప్తిగా కొనసాగునని, ప్రతీ ఒక్కరూ వారానికి ఒక్క రోజు ఆశ్రమ ఆరాధనలో రెండు గంటలు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని అన్నారు. సద్గురు ప్రభోదిత జ్ఞానం ద్వారా మనస్సు, శరీరం కూడా ఆరోగ్యంగా ఉండునని కావున దన సంపద కన్నా జ్ఞాన సంపద గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అత్తి వరలక్ష్మి, పెరిక కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి పురుషోత్తం గంగా భవాని, నోబుల్ ITI correspondent శ్రీ GVV సత్యనారాయణ, శ్రీ యడ్ల వర ప్రసాద్, జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ,కొండి వెంకట అప్పారావు పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పాల్గొన్నారు.

T.Timmapuram Ashram

H.Kothuru Ashram

Newspaper clipping

You may also like...