Reopening of reconstructed of Kattamuru Ashram on 27th October 2023

కట్టమూరు
కోపం వల్ల, క్షణికావేశంలో మానవుడు తీవ్రమైన సంక్షోభానికి గురి అగుచున్నాడని అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ శాఖను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అమృత హస్తాలతో ఆవిష్కరించారు. అనంతరం సభ నుద్దేశించి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లితండ్రుల మధ్య సహనం లేకపోవుట వలన కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నం అవుతున్నది. దైనందిన జీవన విధానం లో మానవుని దినచర్య సుఖంగా జరగాలంటే సద్గురు ప్రభోదిత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం గ్రహించాలని డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. గ్రామం లో ఉన్న ప్రతీ ఒక్కరూ నా మొక్క నా శ్వాస కార్యక్రమం ద్వారా 3 మొక్కలు నాటి గ్రామాన్ని హరితవనం గా తీర్చి దిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కన్వీనర్లు శ్రీ మేడిద సూరిబాబు, శ్రీమతి కొల్లు సూరీడు, శ్రీ సూరి పంతులు మాస్టారు, డివిజన్ కన్వీనర్ శ్రీ రేకా సత్యనారాయణ,జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ , పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పాల్గొన్నారు.

You may also like...