Bavuruvaka Sabha conducted on 20th December 2025

ప్రెస్ నోట్

బపురువాక

Δ. 20-12-2025

బపురువాక గ్రామాన్ని బంగారు వాక గ్రామంగా తీర్చిదిద్దుకుందామని డా॥ ఉమర్ ఆలీషా గారు పిలుపునిచ్చారు.

శ్రీ అహ్మద్ అలీషా గారు మాట్లాడుతూ ఆనాటి కాలంలో ఈ బవురువాక గ్రామానికి రావాలంటే చాలా కష్టమయ్యేది. అలాంటి సమయంలో శ్రీ మొహిద్దిన్ బాషా గారు రెండు చక్రాల వాహనంతో అరగంటలో వచ్చేసేవారు, వారు అచ్చట కనిపించేవారు ఇక్కడ కనిపించేవారు. అలాంటి మహనీయమూర్తి వచ్చి పాదము మోపి ఈ ప్రదేశం పావనం చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయములను కల్పించారు ఇచ్చట ప్రజలు అమాయకులు ఇచ్చటి ప్రజలను ఉద్దరించడానికి సకల సదుపాచయములు కల్పిస్తూ జ్ఞానబోధ కూడా చేసి వారిని ఉద్దరించారని చెప్పారు.

శ్రీ హుస్సేన్షా గారు మాట్లాడుతూ శ్రీమొహిద్దీన్ భాష గారు ఇక్కడి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి వారిని రక్షించడానికి ఈ ప్రదేశానికి వచ్చారని ఇక్కడ ప్రజలు దాహార్తితో ఎంతో సతమతమయ్యే వారిని వారి కోరిక తీర్చడానికి ఈ ప్రాంతంలో మంచినీరు మంచినీటి బావిని తవ్వించారు. ప్రజల దాహార్తిని తీర్చారని దానికి ప్రజలెంతో ఆనందించారని చెప్పారు.

శ్రీ గోసుల రమణ గారు మాట్లాడుతూ వారి అనుభవాన్ని వినిపించారు.

శ్రీ మండా అప్పారావు సర్పంచ్, ఐపురువాక మాట్లాడుతూ శ్రీ స్వామి వారు మాకెంతో మేలు చేశారని చెప్పారు పిట్టె అప్పారావు గారు ఎమ్.పి.టి.సి. గారు మాట్లాడుతూ పీఠాధిపతులు మాకు రామాలయం కట్టించారని అలాగే మెడికల్ కార్యక్రమాలు నిర్వహించారని అందుకు గురువుగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమానికి సి.సి. రోడ్లు, ఏర్పాట్లలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

శ్రీమతి దొడ్డి మంగయమ్మ గారు మాకు సర్పంచ్ గారి, అమ్మగారు మాట్లాడుతూ శ్రీ స్వామి వారు ఆశీస్సులు ఇవ్వడానికి వారు మావెంటే మాతో ఉన్నారని, అలాగే ఉమర్ ఆలీషా గారు మాకు భోజన వసతి, వైద్య సదుపాయాలు కల్పించారని కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ పాకల చిన్నబ్బాయి గారు మాట్లాడుతూ మొహియద్దీన్ బాష్ గారు సాక్షాత్ భగవంతుడు అవతారమని వారి లీలలు చూచి తరించారని మెకములు మధ్య జంతువుల మధ్య వారు శయనించేవారని నిజంగా వారు దేవుని స్వరూపమని చెప్పారు.

శ్రీ నవమ పీఠాధిపతులు డా॥ ఉమర్ ఆలీషా వారు మాట్లాడుతూ ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశం ఇది బవురువాక కాదు బంగారు వాకగా చెప్పుకోవచ్చని చెప్పారు. నాల్గవ పీఠాధిపతి కహనెషావలి గారు పవిత్ర తాండవ నది రోడ్డున సంచరించి అచ్చటి ప్రజలను పునీతులను చేసారు. అలాగే వారి కుమారులు శ్రీ మొహియద్దీనా ్బద్దా గారు కొండవాలు ప్రాంతంలో తపస్సు చేసి ఆ ప్రాంతాన్ని పునీతంచేసారు, అలాగే 8వ పీఠాధిపతులు ఈ బపురువాక ప్రదేశంలో నడయాడి ఈ ప్రాంతాన్ని పునీతం చేసారు. పవిత్ర మూర్తులు, మొహిద్దీన్ బార్షా గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినపుడు ఇక్కడ ప్రజల కష్టాలు చూచి ఈ ప్రాంతంలో మంచి నీటి బావిని త్రవ్వించి ఇక్కడ ప్రజల దాహార్తిని తీర్చారు. అవతారులు మనకు ఎప్పుడు సామాన్యంగా కనిపిస్తారు. కాని వారు చేసే అద్భుత కార్యాలు చూసి వారిని భగవత్స్వరూపంగా గ్రహించి తరించాలని చెప్పారు. మనకు అనేక బాధలు ఉంటాయని వాటి నుండి బయట పడటానికి పీఠాధిపతులను, గురవులను భగవంతుని దర్శించి వాటిని పొందిన తరువాత భక్తి కలిగి ఉండాలని సేవ దృక్పధం కూడా పెంచుకోవాలని అప్పుడే మన జన్మ ధన్యమవుతుందని చెప్పారు. మన కళ్ళతో ఈ సృష్టిని చూస్తున్నామని అలాగే సామాజిక సేవ, జ్ఞాన సేవ అనే రెండు నేత్రాలతో దర్శించి ధన్యులుగా వారిని అలాగే రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో కూడా ఆశ్రయాన్ని నిర్మించుకొని ప్రజలకు సదుపాయాలను కల్పించుకుందామనని. సెలవిచ్చారు. అలాగే అడవులను నరక వద్దు అడవి జంతువులను చంపవద్దని ఆదేశించారు. అదే దైవసేవని ప్రతి ఒక్కరూ మూడు మొక్కలనే కాక ఇక్కడ ముప్పై మొక్కలను నాటి ప్రకృతిని రక్షించాలని అదియే భగవంతుని సేవయని గ్రహించాలని ఆశీర్వచనాలు అందజేసారు.

వేదికను అలంకరించినవారు: శ్రీ నవమ పీఠాధిపతి డా॥ ఉమర్ ఆలీషా అధ్యక్షత వహించగా వారి బ్రదర్స్ అమ్మద్ ఆలీషాగారు, హుస్సేన్షాగారు మరియు కుటుంబ సుభ్యులు పాల్గొన్నారు.

గోసులు రమణ తూర్పు గోదావారి కన్వీనర్

You may also like...