95th Annual Congregation | MahaSabhalu – 11th Feb 2023 – Day 3

11th Feb 2023 – MahaSabha Day 3 – 11-ఫిబ్రవరి -2023 వార్షిక మహాసభ – మూడవ రోజు

PRESS NOTE
Dt. 11. 2. 2023,
PITHAPURAM.

కాలానికి ఎవరూ అతీతులు కారు

…..పీఠాధిపతి – డాక్టర్ ఉమర్ ఆలీషా

మానజీవితంలో అత్యంత విలువైనది కాలం అని, మానవుడు కాలాన్ని సద్విని యోగం చేసుకోవాలని, కాలానికి ఎవరూ అతీతులుకారని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. పీఠం 95వ వార్షిక జ్ఞాన మహాసభలు ముగింపు సందర్భంగా శనివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద జరిగిన సభలో ఆలీషా సభ్యులకు అనుగ్రహ భాషణ చేసారు. సామాన్యుని మొదలుకొని తత్వవేత్తల వరకూ కాలం అందరినీ పరీక్ష పెడుతుందని తెలిపారు.
తాత్వికులు యోగులు అందరూ కాలగమ నంతో ప్రయాణం చేసిన వారేనని అన్నారు. కాలానికి అతీతంగా ప్రయాణించే జీవి ఏదీ ఈ సృష్టిలో లేదని వెల్లడించారు. ఆధ్యా త్మిక తాత్విక జ్ఞానాన్ని పెంపొందించు కోవడం ద్వారా కాలం పెట్టే పరీక్షలను తట్టుకునే శక్తి మానవుడికి లభిస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఠం చేపట్టిన “నా మొక్క – నా శ్వాస” కార్యక్రమంలో ప్రతి సభ్యుడూ పాల్గొని తమ వంతుగా ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపుని చ్చారు. నాటే ప్రతి మొక్కా ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ తో సమానమని అన్నారు

సభకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాలు మరియు విని యోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరియు పిఠాపురం మాజీ శాసనసభ్యుడు ఎస్. వి. ఎస్.ఎన్. వర్మ మాట్లాడుతూ మానవుడు గురువును ఆశ్రయించి భ్రాంతిశక్తులను తొలగించుకు న్నప్పుడు తనలోని పర మాత్మను దర్శించు కోగలుగుతాడని తెలి పారు. సూఫీ తత్వ వేత్తలైన ఈ పీఠాధి పతులు జ్ఞాన మహా సభల ద్వారా బ్రహ్మ విద్య నేర్పుతూ విశ్వ మానవ శ్రేయస్సు కొరకు పాటుపడుతున్నారని కొనియా డారు. పీఠాధిపతి ద్వారా తాత్విక జ్ఞానాన్ని పొందిన శిష్యులు ఆ జ్ఞానాన్ని మరింత మందికి పంచాలని సూచించారు.

తదుపరి పీఠం ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి కారుమూరి మరియు పిఠాపురం మాజీ శాసనస భ్యుడు వర్మలతో పాటుగా పీఠాధిపతి ఆలీషా ప్రారంభించారు.

అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లు, పక్షుల ఆహారం కొరకు తయారుచేసిన ధాన్యపు కుచ్చులు మరియు అంధ విద్యార్థులకు ఎన్. ఆర్. ఐ. సభ్యులు పేరూరి ఉమా అరవింద్, విజయరామ సుబ్బారావు, సన ఏర్పాటు చేసిన నూతన వస్త్రాలను పీఠాధిపతి సమక్షంలో మంత్రి చేతులమీదుగా సభలో అందించారు. తదుపరి పీఠం రూపొందించిన పలు కరదీపికలు, గ్రంధాలను సభలో ఆవిష్క రించారు

సభలో పాల్గొన్న పీఠం ఎన్.ఆర్. ఐ. సభ్యుడు యాదిరెడ్డి, పీఠం సభ్యులు ఎన్.టి.వి. ప్రసాదవర్మ జి. రామ్ ప్రసాద్, పి. మంజుల, తదిత రులు మాట్లాడుతూ గురువును ఆశ్ర యించి గురుపథంలో పయినించి జ్ఞాన సాధన చేయువారికి ఆత్మ తత్వం తెలియబడుతుందని తెలిపారు.

పీఠం నిర్వహిస్తున్న తాత్విక బాలవికాస్ ద్వారా ఆధ్యాత్మిక తరగతుల్లో శిక్షణ పొందిన చిన్నారుల ప్రసంగాలు సభికు లను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్బంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ఛైర్మెన్ బొంగరాల రవిచంద్రన్, వజ్రకూటం సర్పంచ్ గుర్రాజు, సిరిపురం సర్పంచ్ రామలింగేశ్వరరావు,
పిఠాపురం మునిసిపల్ కౌన్సిలర్స్ కోళ్ల బంగారుబాబు, రాయుడు శ్రీనుబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి మాకినీడి శేషు కుమారి, కాకినాడ జడ్పీ వైస్ చైర్మన్ బుర్ర అనుబాబు తది తరులు పీఠాధిపతిని దర్శించుకున్నారు.

సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఎ.ఉమ మరియు అంధ విద్యార్థులు ఆల పించిన కీర్తనలు సభికులను రంజింప చేసాయి.

ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు.

News Paper

You may also like...