రాజమహేంద్రవరం లో శ్రీ సత్య సాయి ధ్యానమండలి వారి ఆహ్వానం మేరకు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సమావేశంలో (NCSS) పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి అనుగ్రహభాషణ

Press note. 8-10-23
హైందవుడైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా,జైన్ అయినా, బౌద్దుడు అయినా, సిక్కు అయినా అందరూ కోరుకునేది ఒక్కటే. సమాజం లో సుఖంగా, శాంతిగా, తృప్తిగా జీవించుటయే, అది త్రయీ సాధన ద్వారా (మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన) మాత్రమే సాధ్యమని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. 8-10-23 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం GSP కన్వెన్షన్ హల్ లో ఏర్పాటు చేసిన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు సదస్సు నుద్దేశించి ప్రసంగించారు. మానవులలో ఉన్న అసహనం, అశాంతి, ద్వేషము లకు ప్రధాన కారణం ఆధ్యాత్మికత లోపించుటయే అని అన్నారు. నేటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు ద్వారా ఆధ్యాత్మిక పరిమళాలు వికసింపబడి, ఆరోగ్యకరమైన జీవన విధానం అలవడుటయే కాక సమ సమాజ స్థాపన, విశ్వ శాంతి ఏర్పడునని డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. దేహమే దేవాలయం జీవుడే ఈశ్వరుడని, మన మంతా మానవతా దేవాలయం అని, అదే అహం బ్రహ్మాస్మి అని,త్రయీ సాధన ద్వారా అనుభవం లో గ్రహించ వచ్చని ఆలీషా స్వామి అన్నారు. ఎంతో మంది యోగులు హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి అధ్యాత్మికత ప్రభోదిస్తున్నారని, పత్రీజి కూడా పిరమిడ్ ధ్యాన ప్రక్రియ బోధిస్తున్నారు అని అన్నారు. ఆది మానవునికి, నేటి ఆధునిక యుగంలో మానవునికి తేడా ను శాస్త్ర విజ్ఞానం ద్వారా గ్రహించ వచ్చు అని అన్నారు. ఆధ్యాత్మిక తత్వం శాస్త్ర విజ్ఞానాన్ని మించి ఉన్నదని, మనస్సును సవ్య దిశలో నడిపించేది ఆధ్యాత్మికతే అని శాస్త్రీయబద్దంగా నిరూపణ అయ్యింది. నా మతం గొప్ప, నేను గొప్ప అనే కన్నా, అన్ని మత ధర్మాలు ఒక్కటే అనేది ఈశ్వరుడు అనే శిఖరాగ్రం చేరుకున్న తర్వాత గ్రహిస్తారు. పర్వతారోహకులు అనేక మార్గాలు ద్వారా పర్వత శిఖరాగ్రానికి చేరుకోవచ్చు. అదే విధంగా శిఖరాగ్రానికి చేరుకునే బాటలన్ని ఒక్కొక్క మతంగా అన్వయించుకుంటే, శిఖరాగ్రం చేరిన తర్వాత ఏకత్వం అనే ఈశ్వరత్వాన్ని దర్శించ వచ్చు అని డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహం భాషణ చేశారు. మానవత్వాన్ని జీవన తత్వంలో మేళవించుకుని నడుచుకుంటే, మనశ్శాంతి గా, తృప్తిగా, ఆనందం గా జీవించ వచ్చిన డా. ఉమర్ ఆలీషా స్వామి అన్నారు. మానవత్వపు విలువలు ప్రభోదించడానికి అవతారులు, ప్రవక్తలు, సద్గురువులు ఆవిర్భవించి, ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తున్నారు అని అన్నారు. జీవన తత్వానికి దశ దిశ నిర్ధారించేదే ఆధ్యాత్మికత అని అన్నారు. ప్రవచనం అనంతరం ధ్యాన మండలి ప్రెసిడెంట్ శ్రీ వీరభద్ర రావు గారు, పత్రీజి మహిళా చైతన్యం సభ్యులు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని ఘనంగా సత్కరించి, పిరమిడ్ మేమొంటో ను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు, పీఠం చరిత్రను సభకు తెలియ చేయగా, స్థానిక కన్వీనర్ శ్రీ దంతులూరి కృష్ణం రాజు, శ్రీ MRK రాజు, శ్రీ కల్కి మూర్తి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ పేరూరి సూరిబాబు,
కన్వీనర్, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం.
9848921799.

You may also like...