నూతన సంవత్సర సభ – 2021 – నియమ నిబంధనలు

నూతన సంవత్సర సభ – 2021

నియమ నిబంధనలు

1-1-2021 శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణంలో సభ జరుగును.

వక్తల ప్రసంగాలు, స్వామి ప్రసంగము అంతా అంతర్జాలం (యూట్యూబ్) ద్వారా వీక్షించండి. సభ్యులు పిఠాపురం నూతన ఆశ్రమంనకు వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకొనవచ్చును.
మహామంత్రోపదేశం ఇవ్వబడును.

ఈ క్రింద సూచించిన కరోనా కోవిద్ – 19 నిబంధనల మేరకు సభ నిర్వహింపబడును.

  1. సభకు వచ్చే ప్రతీ సభ్యుడు తప్పనిసరిగా పరిశుభ్రమైన మాస్కు ధరించాలి.
  2. ప్రతీ సభ్యుడు ప్రధాన గేటు వద్ద తమ యొక్క టెంపరేచర్ చెక్ చేయించుకొని చేతులను శానిటైజ్ చేసుకొని ఆశ్రమంలోనికి ప్రవేశించవలెను.
  3. ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించవలెను.
  4. స్వామి దర్శనం చేసుకొన్న అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన పటికబెల్లెం ప్రసాదం మరియు పులిహోర ప్రసాదమును తీసుకొని వెంటనే బయలుదేరవలెను.

కరోనా కోవిద్-19 లాక్ డౌన్ తరువాత మొట్ట మొదటగా ప్రధాన ఆశ్రమంలో ప్రత్యక్షముగా జరుగుతున్న సభ. ఈ సభలో నిర్దేశించిన పద్దతి ప్రకారం కరోనా నిబంధనల మేరకు సభ నిర్వహింపబడును.

ప్రతీ ఒక్కరూ కోవిడ్ – 19 నిబంధనలు విధిగా పాటించి ఈ సభలో పాల్గొనవలెను.

You may also like...