ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 149| 23rd November 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 149
వక్తలు :
- శ్రీమతి గుర్రాల పద్మావతి, విశాఖపట్టణం
- కుమారి పండ్రోతి ఉమా సత్యశ్రీలక్ష్మి, ఏలూరు
307 వ పద్యము
జంకుచునుండు మన్నిటను జంకకు దేనికినైనఁ గాని యా
పంకము వచ్చినప్పు డరిభంజన దగ్ధదవాగ్నిఁ బోలె ని
శ్శంకను మార్చివేయుము వెసన్ గపిలుండు మహమ్మ దాపదన్
సంకరమారమారకము చాట్పున జ్ఞానదవాగ్ని వ్రేల్చరే.
308 వ పద్యము
జడము ప్రపంచజీవితము జన్మలయాకృతి దీనియందు నీ
నడత నిషిద్ధమైనది యనంతమహామహిమాస్వరూప మే
ర్పడవలె నన్న నూపిరిని గ్రాలెడు చక్రము లాఱు దృష్టిలో
నిడుకొని వాని నూర్ధ్వమున నెట్టుము నాశము రాదు ప్రాణికిన్.