ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 100| 16th December 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

వక్తలు :

  1. శ్రీ సప్పా వీరబాబు , కాట్రావులపల్లి
  2. కుమారి వనుము రేణుక హిమ హర్షిణి, కాకినాడ

207 వ పద్యము
మనసున శక్తి యున్నదది మాయను గూడి వికల్పభావసం
జనిత వికారవీచికల సాగును దానిని బట్టి మంచి సా
ధన సరియైన మార్గమునఁ దద్దయు నిల్పి యనల్పకల్పనా
ధునిక విచిత్రదృశ్యములు తోరణఁ గట్టఁగవచ్చు నిచ్చలున్.

208వ పద్యము
ఊహలకందరానిది సముజ్జ్వలమైనది బ్రహ్మతత్త్వము
త్సాహసమన్వితంబును ప్రశాంతమునైన తితీక్షచేత సం
దేహము బాసి నేననెడు దీక్ష చరాచరమందు జేర్చి వ్యా
మోహము మాని చూచునెడ ముందరఁ గాంతువు విశ్వరూపమున్.

You may also like...