ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 163| 01st March 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 163
వక్తలు :
- శ్రీమతి రామిశెట్టి సాయిప్రసన్న, హైదరాబాద్
- కుమారి జక్కి దుర్గలక్ష్మి, చంద్రంపాలెం
335 వ పద్యము
మ. ఒక యవతారిచే వరములో ధనధాన్యములో పురంబులో
వికచసరోజలోచనలొ పృథ్వియొ కోరినయంత పొంది యూ
రక తిని నిద్రపోవునెడ రాదొకొ మృత్యువు వచ్చెనేని యీ
సకల ధరాప్రపంచకము చచ్చినవారల వెంట వచ్చునే?
336 వ పద్యము
ఉ. చీఁకటియందు దుఃఖములచేఁ జివుకంగల జీవితంబు నీ
వే కడఁబెట్టఁబోకు మిది యేమిటి లోకము మూఁడునాళ్ల ము
ల్లై కడతేరుచున్నది యహంబు లుషస్సులు బాణపంక్తులై
తాఁకి చికాకుపెట్టు ప్రమదంబను నాసను మానుమేయెడన్.