ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 169| 12th April 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 168

వక్తలు :

  1. శ్రీమతి యిళ్ళ వెంకటలక్ష్మి, కాట్రావులపల్లి
  2. కుమారి భట్టు హర్షిణి, హైదరాబాద్

347 వ పద్యం
ఉ. దారులు కావు మృత్యువును దన్ని నివృత్తిని గాంచునట్టి సం
స్కారముచేఁ జరాచరము గాంచుటకై హృదయాగ్ని కీలలన్
జీరి శరీర మాహుతిగఁ జేసినఁ గాని నిజంబు నీశ్వరున్
జేరెడు దారియే దొరకి సిద్ధి వహింపదు జ్ఞానయోగికిన్.

348 వ పద్యం
ఉ. దారులు కావు మృత్యువును దన్ని జితేంద్రియులై గుణాన్వితా
కారమలీమసంబయిన కర్మను డించి నిజాత్మతత్త్వ సం
స్కార సమున్నతం బయిన జ్ఞానము నేర్చుటకై జపవ్రతా
చార మఖాదికర్మములు సంధ్యలుపాసన యర్థ్యసిద్ధులున్.

You may also like...