ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 179| 21st June 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 179
- శ్రీమతి సామంతుల లక్ష్మి, విస్సాకోడేరు
- కుమారి భట్టు పార్వతి, హైదరాబాద్
367 వ పద్యం
శా. వేదాంతంబులు యుక్తివాదమను విభ్రాంతిన్ విసర్జించు మీ
వేదాంతంబు రసానుభూతినెద నావిర్భూత చైతన్య వి
ద్యాదయితంబగు ప్రేమ పాఠములు నధ్యాత్మ్యంబుగాఁ బోల్చి సం
పాదింపందగు జీవశక్తి యమృత ప్రాయంబుగా మాఱఁగన్
368 వ పద్యం
మ. సదసద్భేదము లర్థశూన్యములు నీ సంసార తాపత్రయా
స్పదమౌ లోకము మిథ్య గాదిది స్వభావంబైన సద్వస్తువం
దుదయంబైనది మృత్తికా ఘటములం దున్నట్టి భేదంబు ను
న్నది లేదన్నది దృశ్యమాత్రములు నానారీతులన్ మాటినన్