ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 181| 05th July 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 181
- శ్రీ దొండపాటి వెంకట సుబ్బారావు, హైదరాబాద్
- శ్రీమతి బుద్ధరాజు శ్రీదేవి, భీమవరం
371 వ పద్యం
శా. ఆత్మానాత్మలు రెండు, వెండియు నవిద్యావిద్యలున్ రెండు, జీ
వాత్మ ప్రత్యగభిన్నతత్వ ప్రకృతిత్వాభాసముల్ రెండు న
ధ్యాత్మైకంబగు నొక్క వస్తువునఁ దాదాత్మ్యంబు వర్తించు నీ
స్వాత్మాధ్యాయము పెద్ద కష్టము పదార్థాన్యాసవాదంబునన్
372 వ పద్యం
ఉ. కొందఱు సాధనాన ననకుంఠిత దివ్యపథంబు వచ్చి యా
చందము బాసెనేని మఱి స్వర్గమువీడి ధరిత్రి వచ్చు నం
చందురు, తద్వివాదము మహత్తర తార్కికమైన దాపథం
బిందు వచింపరాదిది సయేశ్వర మర్థపదార్థవాదముల్