ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 183| 19th July 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 183
- శ్రీమతి యర్ర అరుణ కుమారి, కాకినాడ
- శ్రీమతి దంగేటి ఉషశ్రీ, వల్లూరుపల్లి
375 వ పద్యం
ఉ. కొందరు నూర్ధ్వలోకములకున్ జను జీవులఁగాంచి వీరలే
మ్రందిన మర్త్యులంచు కొఱమాలి వచింతురు, తత్త్వవేత్త లీ
చందము వాసనాసహితసంస్కృతి గాఁగ నెఱింగి దేహి సం
స్పంద తమోవిదూర మగు స్వర్గము గాంచు నటండ్రు సిద్ధులై.
376 వ పద్యం
ఉ. మానవుఁడై జనించి నిజమాయను దా స్వకపోలకల్పిత
జ్ఞానము నేర్చి యీ ప్రకృతి సర్వము నీశ్వరరూప మంచు లో
కానకుఁ జాటెనో యపుడుగాని పదార్థ యథార్థగాథలన్
దానయిపోయి చూడఁగల దారియె తోఁచఁగలే దొకింతయున్.