ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 191| 13th September 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 191
వక్తలు :
- శ్రీమతి బిర్రా భవాని, విశాఖపట్టణం
- కుమారి మండా ఉమామహేశ్వరి, కాకినాడ
391 వ పద్యం
చ. ఎవరు నిజానురాగమున నీశ్వరునిం గని భక్తితో జవం
జవమును త్రోసి జ్ఞానులయి స్వార్థము రోసి గురున్ భజించి త్రో
వ వదల కంతరాయములు బాసి ప్రవృద్ధికిఁ దెత్తురో యదే
యవనికి మార్గదర్శక మతాకృతి వెల్గుచునుండు నారయన్
392 వ పద్యం
ఉ. మంచిదొ చెడ్డదో కలము వ్రాసెడు వ్రాఁతకుఁ గాగితంబు న
ర్థించుచు చాటు నామురళి యే గతి యూదిన నట్లు పాడి రూ
పించును నీవు నీగురుని కీగతి లొంగి నిజానురాగ రా
గాంచితమైన నీ మఱుగుఁ గాంచియుఁ జాటుము నీ రహస్యమున్.