ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 194| 04th October 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 194

వక్తలు :

  1. శ్రీమతి అన్నాప్రగడ విజయలలిత, హైదరాబాద్
  2. కుమారి కేశనకుర్తి సునీత, కాకినాడ

397 వ పద్యం
సీ. బౌద్ధుల వైదికవాదు లోడించి దే
శము వెళ్ళగొట్టించి చంపినారు
మాహమ్మదీయుల ప్రాణాలు క్రైస్తవుల్
క్రూసైడు యుద్ధాలఁ దీసినారు
జరధస్త్రు లధినివేశంబుల స్థాపించి
తీర్చి శైవుల కడతేర్చినారు
యూదులు పరమత బోధకులను బట్టి
కుత్తుకల్ రంపాలఁ గోసినారు
తే.గీ. ఇట్టి మతమతాంతర వధ లెన్నొ కలవు
ఆ మహారక్తపాతాల కాగకుండ
నేఁగి యెదు రీది మృతికి ఱొమ్మిచ్చినారు
వారివలె జ్ఞానసభ నిల్పవలయు మీరు.

398 వ పద్యం
ఉ. కొందఱఁ జంపినారు మఱికొందఱి నాఁడురి దీసినారు నిం
కొందఱఁ గొట్టినారు తెగి కొందఱఁ బట్టి బహిష్కరించి రీ
చందము నెందఱిన్ వధలు సల్పినవారి తదేకదీక్ష స్వ
చ్ఛందవిహారమున్ మతవిచారము మానఁగలే దొకప్పుడున్.

You may also like...