ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 201| 22nd November 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 201

వక్తలు :

  1. శ్రీ నడింపల్లి వాసు వర్మ, విశాఖపట్నం
  2. కుమారి రేఖ ఉమా మహేశ్వరి, రాజపూడి

412 వ పద్యం
శా. గోషా యంచును స్త్రీల మంచు నగరిన్ గూర్చున్న వృక్షాలనన్
బోషింపంబడుచుందు రందులకె కాఁబోదీ మనుష్యత్వమే
యోషల్ జ్ఞానము నేర్చి నేర్పుదురొ యీ యుర్విన్ బ్రదీపించి యా
యోషల్ ధన్యలు పూర్వధర్మముల నుద్యోగించినన్ దూరినన్.

413 వ పద్యం
తే.గీ. గ్రీసు యుద్ధంబునందు టర్కీ వధూటు
లశ్వములఁ బోలెఁ దోడ్పడి యరుల గెలిచి
నిలిచి జయభేరి వాయింపఁ గలిగినారు
లేనిచోఁ జచ్చి యుంద్రు గోషానగళ్ళ

You may also like...