ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 205| 20th December 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 205

వక్తలు :

  1. శ్రీ పెనుమల్లు వెంకట రామారెడ్డి, విశాఖపట్నం
  2. శ్రీమతి యిర్రి ఉమా పద్మ, అత్తిలి

420 వ పద్యం
ఉ. చావును పుట్టుకన్ గలుగు సత్యము నేరును చెప్పలేరె యీ
చావును కాలవాహిని వెసన్ గలిగించుచు నున్న మార్పు జీ
వావసథంబు యోజన శతాధికమై భయదంబుఁ గూర్చు నీ
తావు రథాంగమట్లు నిరతంబుఁ బరిభ్రమణంబుఁ గాంచెడున్.

421 వ పద్యం
శా. ఏదో దారిని త్రొక్కిపొమ్ము తుద కేదేదో తటస్థించు నా
మోదంబో వ్యసనంబొ దానికయి నీ బుద్ధిన్ వితర్కింప కా
పాదింపంబడు నెల్ల యేవిధమునో వచ్చున్ బ్రయత్నించితే
రా దీ యర్థము కర్మబద్ధము ఘటప్రారబ్ధ మీ భోగముల్.

You may also like...