ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode -23| 25th June 2022

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 23

వక్తలు :

  1. కుమారి సంకు శ్రీయ సాహితి, హైదరాబాద్
  2. శ్రీ గరిగిపాటి రాము, గుమ్ములూరు, పశ్చిమ గోదావరి
  3. శ్రీమతి నార్నిస్వాతి, కాకినాడ

48వ పద్యము.
మేము రచించు గీతములు మృత్యువు వాయు పథంబులందులో
నేమియు నర్థహాని కెడమియ్యక ఉన్నది యున్న యట్లుగా
నే మహనీయుఁడున్ నడచి యీశ్వరరూప మెఱుంగ నేర్చునో
ఆ మహితాత్ముఁడొక్కఁడె యథార్థ మెఱింగి మృతిన్ జయించెడున్.

49వ పద్యము
నాతోనున్న మహాకవీశ్వరుల నానాకావ్యముల్ వ్రాసి నెం
తో తత్త్వాత్మకదృక్ప్రపంచకము నుద్యోగించి చిత్రించుచున్
చైతన్యంబు గలుంగఁజేసితి మహాసత్యస్వరూపంబుతో
జేతో వీధిని నీశ్వరుంగనెడు వైచిత్ర్యంబుఁ జూపించితిన్.

50వ పద్యము
ఎవ్వరి నొవ్వ నాడమిటు లెవ్వరినోరును కట్టివేయమే
మెవ్వరి దారి దూరి మరలింపము మాకడ వచ్చువారితో
నివ్వటిలంగ నీ తెఱువు నేర్పి తరించుమటంచు చెప్పి
మాదివ్వె వెలుంగఁజేసెదము దివ్యులు గన్పడ బుద్ధి మాన్పడన్.

You may also like...