ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 81| 5th August 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 81
వక్తలు :

  1. శ్రీమతి చెనుమోలు రామలక్ష్మి, అమెరికా
  2. శ్రీ నడింపల్లి వాసు వర్మ, విశాఖపట్నం

169 వ పద్యము
వెలుఁగును జూచి యా వెలుఁగు వెన్నెలకన్నను తేటుగాఁగ నీ
వెలుఁగునఁ బోల్చి యా వెలుఁగు వెళ్ళిన మేరకుఁ జూపు నిల్పి నీ
తెలివిని మాటుచేసి యట తేటగఁ దోఁచెడు బాటలోన నీ
వలయకపొమ్ము విశ్వమున కవ్వలి స్వర్గము దోఁచునచ్చటన్.

170 వ పద్యము
తెలిసిన సద్గురుండు తన తేజము శిష్యుని వైపు పెట్టి ని
ర్మలిన వికాసరూపమున మాయను మాయను జేసి చీఁకటిన్
దొలఁగఁగఁ ద్రోసి యాత్మ తనతోఁ జనుదేరఁగ మూఁడు లోకముల్
వలగొని దేహబంధములు వాయ ముముక్షుని సేయు నెంతయున్.

You may also like...