ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 86| 09th September 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 86

వక్తలు :

  1. శ్రీమతి కత్తిక గంగా భవాని, హైదరాబాద్
  2. శ్రీమతి తోట ఉమామహేశ్వరి, బల్లిపాడు

179 వ పద్యము
చీఁకటియందె సాధకుఁడు సృష్టి సమస్తము నైంద్రజాలికుం
డేకముఖానఁ జూపు గతి నీశ్వరరూప మహాపదార్థముల్
లోకములన్ని చూడఁగల లోచనముల్ గడియించునట్టి య
స్తోకతపస్సమాధిని విధూత మలీమసులౌదు రారయన్

180 వ పద్యము
వ్యయరహితంబు మానసికమైన వెలుంగు తపస్సమాధిలో
నయనములారఁ జూచుచు ననంత మహామహిత ప్రపంచమే
దయి యిటు రూపమేర్పడ మహాద్భుతలీల నటించుచున్నదో
స్వయముగ నా పునాది గనవచ్చును బ్రహ్మముగాఁగ సర్వమున్

You may also like...