ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 95| 11th November 2023

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 95

వక్తలు :

  1. శ్రీ యర్రంశెట్టి సురేశ్ కుమార్, బల్లిపాడు
  2. .శ్రీ సకినాల వేంకటేశ్వర రావు, హైదరాబాద్

197వ పద్యము
మానవ జీవితంబనెడు మట్టిని మట్టిని గల్పివేసి వి
జ్ఞానముచేత సృష్టిని ప్రకంపితమున్ బొనరించి యందు నీ
వైన మహాపదార్థమె చరాచరముల్ నడిపించుచున్నదం
చా నిజదీక్షలో వెలుఁగువై యమృతత్వము గాంచు మెంతయున్.

198వ పద్యము
ఆ రవి యా నిశాకరుఁడు నా యుడువర్గము స్వర్గధామమోం
కారము దేనిలో నణఁగి కాంతి వహించు తదీయ తేజమం
దారయఁగా సుషుమ్న యను ద్వారము లోపల నుండి రూఢమై
తేరి చరాచరంబయిన దీప్తి వహించు ప్రశాంతదీధితిన్.

You may also like...