“తాత్విక బాలవికాస్” 2022 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 6వ తేది న ప్రారంభమైనది
ప్రెస్ నోట్
పిల్లలలో సృజనాత్మక ను పెంపొందించేదే తాత్విక బాల వికాస్ అని పిఠాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీ రామ్మోహన్ రావు గారు అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణా శిబిరమును ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్ కమిషనర్ గారు ప్రారంభించగా, ఉమర్ ఆలీషా పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ శ్రీ హుస్సేన్ షా గారు జ్యోతి ప్రజ్వలన చేశారు . ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ గారు సభకు అధ్యక్షత వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ శ్రీ జనార్ధన్ గారు, ప్రముఖ సి.సి.అర్.టి ట్రైనర్ శ్రీ ప్రసాద్ గారు, పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గారు, సెంట్రల్ కమిటీ మెంబర్ శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు వేదిక పై ఆసీనులై ప్రసంగించారు. శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వర రావు గారు అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు వందన సమర్పణ చేశారు.
శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ గారు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈ రోజు నుండి 12 వ తేదీ వరకు 7 రోజుల శిక్షణా కార్యక్రమo లో విజ్ఞానం, వినోదం, విహారం, నూతనోత్సాహం, బహుముఖ వికాసం కల్గించే విధంగా 7 రోజుల శిక్షణా కార్యక్రమాల వివరాలను సభకు తెలియ చేశారు. హుస్సేన్ షా మాట్లాడుతూ పిల్లలలో నిబిడీకృతంగా ఉన్న మేధా సంపత్తిని వెలికితీసే విధంగా శిక్షణ జరుగుతుందని అన్నారు. కమిషనర్ గారు మాట్లాడుతూ చిన్న తనం నుండి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను,సృజనాత్మకతను పెంపొందించే కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఎంతో ఉపయోగకరం అని, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. 90 మంది విద్యార్థులు 7 రోజుల పాటు, ఉచిత శిక్షణ, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించిన పీఠాధిపతులకు ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో 9 మంది టీచర్స్ మెంటర్స్ గా 7 రోజుల పాటు సేవలందిస్తారు.
ఇట్లు
శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ,
ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్.