USA – June Monthly Aaradhana conducted Online on 04th June 2023

USA – 04 జూన్ 2023 ఆదివారం అమెరికాలో జూన్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, శ్రీమతి యెర్రా రేణుక గారు మరియు శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారి స్వగృహములలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

పాలుగొన్న సభ్యులు:
శ్రీ కుంట్ల ప్రసాద్ గారు, శ్రీమతి కుంట్ల రాణి గారు, చిరంజీవి వర్ధన్
శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు, చిరంజీవి హను రిష్, చిరంజీవి కుందన్
శ్రీ చెనుమోలు నాగేశ్వరరావు గారు, శ్రీమతి రామలక్ష్మి గారు, చిరంజీవి సత్య కోవిద్, చిరంజీవి కాశ్వీ
శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు, చిరంజీవి సత్తి శ్రీచరణ్, చిరంజీవి సత్తి తేజస్
శ్రీమతి గోసుల గంగాభవాని గారు, చిరంజీవి మదన భవ్య శ్రీ
శ్రీమతి నడింపల్లి నీలిమ గారు
శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
శ్రీమతి యెర్రా రేణుక గారు
శ్రీ తమ్మిశెట్టి సత్యవల్లి శ్రీనివాస్ గారు

కార్యక్రమ వివరములు

  1. ప్రార్ధన – శ్రీమతి అవ్వారి లక్ష్మి గారు
  2. మంత్ర ధ్యానం మరియు స్వామి హృదయ నమస్కారములు – 3 నిముషాలు – సభ్యులందరు
  3. హారతి – శ్రీమతి యెర్రా రేణుక గారు
  4. గురుస్తుతి – శ్రీమతి కుంట్ల రాణి గారు
  5. ఈశ్వరుడు – శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారు
  6. కీర్తన – శ్రీ కోసూరి సత్యనారాయణ గారు, శ్రీమతి కోసూరి దివ్యవాణి గారు
  7. USA తాత్విక బాలవికాస్ – చిరంజీవి యెర్ర ఉమ ప్రసంగం
  8. అమెరికాలో త్రయీసాధన – మే 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి కోసూరి దివ్య వాణి గారు
  9. గురువారం స్వామి పిఠాపురం సభలు – మే 2023 నెల సంక్షిప్త సమాచారం – శ్రీమతి యెర్ర రేణుక గారు
  10. అంశము : సూఫీవేదాంత దర్శము (Episode – 36 & 37) |78, 79 & 80 పద్యములు

78 వ పద్యము
ఆ నిరవద్యమై చెదరనట్టి మహామహనీయతత్త్వ వి
జ్ఞానము సూక్ష్మమార్గములఁ గాంచఁగవచ్చును దాని కిన్నినా
ళ్ళౌనని లెక్కలేదు హృదయంబు పవిత్రతఁ జెందెనేని సో
పానము లెక్కినట్లు భవబంధము వాయుదు రొక్క పెట్టునన్.

79 వ పద్యము
ఆ పరలోక జీవితమె యారయ శాశ్వత మెల్లవారి కే
లోపము లుండఁబోవు తనలోపలనున్న యథార్థవస్తువే
కాపుర ముండు నచ్చట నఖండసుఖైక రసప్రధానమై
దీపముబోలె వెల్గు తన తేజము నీశ్వరతేజ మొక్కటై.

80 వ పద్యము
గర్భవాసమునందు జ్ఞానంబు నేర్చెను
నసురబాలకుఁడు ప్రహ్లాదుఁడరయ
అయిదేండ్లప్రాయాన హరిని సందర్శించి
కొండెక్కిపోయె ధృవుండు గంటె
బాల్యమందరసి తపస్సమాధిని పర
మాత్ముఁ గాంచిరి సనకాదిఋషులు
ఏడేండ్లనాఁడు కొండాడ నల్లా మహా
మతిని గాంచెను మహమ్మద్రసూలు
ఇట్లుభక్త వతంసులు నెందరెంద
రీశ్వరుని గాంచి తరియించి యిద్ధకీర్తి
గాంచిరో నేఁడు గ్రంథాలఁ గాంచగలరు
వారుపోయిన పోలేదు వారి యశము.

  1. సభ్యుల విశ్లేషణ

మోడరేటర్ & కోఆర్డినేటర్: టి.ఎస్.వి శ్రీనివాస్


You may also like...