“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 4 జూన్ 2023న కార్యక్రమము నిర్వహించబడినది

“సస్యవృద్ధి బీజారోపణోత్సవం” – 4 జూన్ 2023న కార్యక్రమము నిర్వహించబడినది

సస్య వృద్ది బీజరోపణ ఏరువాకపూర్ణిమ ఉత్సవం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం నూతన ఆశ్రమం లో ఏరువాకపూర్ణిమ సందర్భంగా గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీ షా వారి సమక్షంలో రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గురు వర్యులు ఏరువాక పూజ జరిపి నాగలి కాడి ఎడ్లు తో పొలం దున్ని కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు .వారి సోదరులు అహమద్ ఆలిషా గారు గురువు గారితో బాటు పొలం దున్ని రైతులకు తమ ఉపన్యాసం ద్వారా ఏరువాక ఉత్సవం ప్రేరణ కలిగించారు.సుమారు 300 మంది రైతులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనం పొందారు.సేంద్రియ వ్యవసాయ రంగం అభివృద్ధి కొరకు ఈ సదస్సులో సద్గురు దివ్య బీజాలు వాడటం ద్వారా ప్రయోజనం పొందిన ఐదుగురు రైతులు ఆదివిష్ణు, శ్రీనివాసరావు, వెంకటేష్,దుర్గారావు,రామకృష్ణ లు,తమ అనుభవాలను తెలియచేసి రైతు సోదరులకు స్ఫూర్తిని ఇచ్చారు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు డి జే రెహ్మాన్, ఎన్.రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ నుండి వచ్చి వ్యవసాయ మిత్ర పురుగులు ద్వారా చీడపీడల నివారణ పద్దతులు, డ్రోన్స్ సహకారం తో వ్యవసాయ రంగం లో చేస్తున్న పనులు,ఆధునిక వ్యవసాయ పరికరాలు ద్వారా ప్రయోజనలు పై పి. మోనిష వై ఎస్ ఆర్ హార్టి కల్చర్ యునివర్సిటీ రామచంద్రపురం అసిస్టెంట్ ప్రొఫెసర్ తెలియ చేసారు. కాకినాడ జిల్లా వ్యవసాయ అధికార్లు సి.హెచ్, శ్రీనివాసరావు, మణిదీప్,సత్య గార్లు, కెవివి సత్యనారాయణ గార్లు పాల్గొన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీ షా వారు ఆదర్శ రైతులకు సన్మానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా గురు వర్యులు రైతులకు సద్గురు దివ్య బీజాలు, విత్తనాలు, గోకృపా అమృతంపంపిణీ చేశారు. ప్రకృతి వ్యవసాయ పరిశోధకులు శ్రీ నందెల ఏడుకొండలు గారు రైతులకు తన అనుభవ పాఠాన్ని ఐ బి పి పి విధానం లో ఎరుకపరచి రైతు ఆదాయాన్ని పెంచుకోవడం, జీవ వైవిధ్యం పాటించడం,ప్రణాళిక తో వ్యవసాయం చెయ్యడం, రైతు పింఛను సృష్టించుకోవడం వంటి విషయాలు ను రైతులకు బోధించారు.తాత్విక బాల వికాస్ పిల్లలు సేంద్రియ వ్యవసాయం పై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. శ్రీ ఏ వి వి సత్యనారాయణ గారు కార్యక్రమం నిర్వాహకులు గా స్వాగత ఉపన్యాసం, శ్రీ ఎన్. టి. వి. ప్రసాద్ వర్మ నిర్వాహకులు వందన సమర్పణతో ఈనాటి కార్యక్రమం వైభవం గా ముగిసినది.

You may also like...