10-ఏప్రిల్-2022 ఆదివారం, ప్రత్తిపాడు మండలం భవురువాక గ్రామం సీతారామ ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు

ప్రెస్ నోట్
యుగాలు గడిచినా శ్రీరాముని ఆదర్శాలు నేటికీ అనుసరణీయం అని శ్రీ అహ్మద్ ఆలీషా అన్నారు. ఆదివారం ఏప్రిల్ 10 2022, ఉదయం ప్రత్తిపాడు మండలం స్థానిక శ్రీ సీతారామ ఆలయ ప్రాంగణంలో శ్రీ అహ్మద్ ఆలీషా, శ్రీమతి మున్వర్ షా దంపతులు సీతారాముల కల్యాణం నిర్వహించారు. అనంతరం ఆలీషా గారు మాట్లాడుతూ శ్రీరామ పరిపాలన, అన్నదమ్ముల అనుబంధం, తండ్రి కొడుకుల సంబంధం, సామాజిక న్యాయం, ఏక పత్నీ వ్రతం వంటి ఎన్నో ఆదర్శాలు గల అవతార పురుషులు శ్రీ సీతారాముల ఆదర్శాలు పాటిస్తే దేశ సమగ్రత, విశ్వ శాంతి ఏర్పడుతుంది అని శ్రీ అహ్మద్ ఆలీషా అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి సోదరులు శ్రీ హుస్సేన్ షా గారు, శ్రీ షహన్ షా గారు, ఫజల్ గారు, పీఠం కమిటీ సభ్యులు శ్రీ పేరూరీ సూరిబాబు గారు, శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ గారు, శ్రీ వై.సత్యనారాయణ గారు, శ్రీ రేకా ప్రకాష్ గారు, స్థానిక పెద్దలు శ్రీ దాట్ల కృష్ణం రాజు గారు, శ్రీ దాట్ల సీతారామరాజు గారు, శ్రీ దాట్ల సీతారామ రాజు గారు, శ్రీ దాట్ల సురేష్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ దొడ్డి సత్తిబాబు గారు, మాజీ సర్పంచ్ నందా కొండబాబు గారు, పెడమల్లాపురం సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు, తదితరులు పాల్గొన్నారు.

https://www.instagram.com/p/CcKiOD6M2TS/?igshid=MDJmNzVkMjY=

You may also like...