ది. 19 నవంబర్ 2019 మంగళవారం ఉదయం 10 గంటలకు వల్లూరి పల్లి గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దంగేటి రామకృష్ణ గారి ఇంటి ఆవరణలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆరాధన మరియు కార్తీక వనభోజన మహోత్సవం జరిగినది

ది. 19 నవంబర్ 2019 మంగళవారం ఉదయం 10 గంటలకు వల్లూరి పల్లి గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దంగేటి రామకృష్ణ గారి ఇంటి ఆవరణలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఆరాధన మరియు కార్తీక వనభోజన మహోత్సవం జరిగినది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉమర్ ఆలీషా సాహితీ సమితి ఉపాధ్యక్షులు శ్రీ టి.మురళీకృష్ణ గారు మాట్లాడుతూ కార్తీక మాస విశిష్టతను తెలియజేశారు. సాహితీ సమితి సభ్యులు శ్రీ సాయి వెంకన్న బాబు గారు పీఠం విశిష్టతను, సద్గురు వర్యుల విశిష్టతను తెలియజేశారు. తాడేపల్లిగూడెం ఎస్.టి.ఓ శ్రీ గారపాటి గోపాలరావు గారు పీఠం నిర్వహించే “నా మొక్క నా శ్వాస” కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దంగేటి రామకృష్ణ గారి దంపతులు ఉసిరి చెట్టు దగ్గర పూజలు నిర్వహించి భోజనాల సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లూరు పల్లి కన్వీనర్ శ్రీమతి పుల్లా తిరుమల గారు, జిల్లా కమిటీ సభ్యులు శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు, పీఠం సభ్యులు శ్రీ తోట సత్యనారాయణ గారు, శ్రీ కట్రెడ్డి షా బాబు గారు, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారు, శ్రీ డి.వి సుబ్బారావు గారు మరియు గ్రామ సభ్యులు పాల్గొన్నారు.

Video

You may also like...