27th Anniversary Spiritual Meeting at Tuni on 04 March 2024

మార్చి 4 తేదీ 2024 సోమవారం తుని లో 27వ వార్షిక ఉత్సవ సభ (సర్వమత సమ్మేళన సభ)

Press note Tuni. 4-3-24
భిన్నత్వం నుండి ఏకత్వం వైపు నడిపించేది మానవత్వము అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తుని చతుర్ధ పీఠాధిపతి శ్రీ కహెనే షా వలీ దర్గా ప్రాంగణం లో ఏర్పాటు చేసిన 27 వ వార్షికోత్సవ మత సామరస్య మహా సభకు ప్రస్తుత నవమ పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అధ్యక్షత వహించి ప్రసంగించారు. మానవుల మధ్య హింసా, అసూయ, ద్వేషము ల నిర్మూలనకు త్రయీ సాధన ఆచరించాలి అన్నారు.పంచ భూత కాలుష్య నివారకు మొక్కలు పెంచుట ప్రతీ మానవుని విధి అని తెలియ చేశారు.హిందూ మత ప్రతినిధిగా శ్రీ పోల్నాటి గోవిందరావు గారు సనాతన వైదిక ధర్మం విశిష్టత ను సభకు వివరిస్తూ శ్రీరాముని సత్య వాక్పరిపాలనా, సీతా మహా సాధ్వి ప్రాతివ్రత్య ధర్మం గురించి వివరించిరి. సత్యాన్ని చెప్ప వలసి వచ్చినప్పుడు ప్రియ భాషణ తో చెప్పాలి అన్నారు. ఇస్లాం మత ప్రతినిధి సూఫీ షేక్ అహ్మద్ జాని మాట్లాడుతూ పీఠాధిపతి ఉమర్ ఆలీషా గారు మత సామరస్య సదస్సుల ద్వారా విశ్వ శాంతి, దేశ సమగ్రత కాపాడుతున్నారని అన్నారు.జగదీశ్వరుడు ఒక్కడే, జగద్గురువు ఒక్కడే, అవతారులు, ప్రవక్తలు, సద్గురువులు సత్య దీక్ష ప్రాధాన్యత, అందరూ కలిసి సమైఖ్య ప్రార్థన చెయ్యాలి అని అన్నారు. క్రైస్తవ మత ప్రతినిధి Rev Dr ఆదూరి SJDV ప్రసన్న కుమార్ మాట్లాడుతూ బైబిల్ అంటేనే మానవత్వం అని అన్నారు. నిన్ను వలెనే పొరుగు వారిని ప్రేమించు, మనిషిని మనిషిగా గౌరవించు అని అన్నారు. జైన మత ప్రతినిధి శ్రీ కాలేపు స్వామినాథన్ మాట్లాడుతూ 24 మంది తీర్థంకరులు ప్రబోధించిన అహింసా ధర్మం పాటిస్తూ సత్య మార్గాన్ని అనుసరించాలని అన్నారు. బౌద్ధ మత ప్రతినిధి మహోదయ శ్రీ యార్లగడ్డ జగదీశ్వర రావు మాట్లాడుతూ ఆధ్యాత్మికత నైతికతకు మూలం అన్నారు వర్తమానం లో చెడును వదిలి మంచిని స్వీకరించి పరివర్తన చెందాలి అన్నారు. రాగ, ద్వేష, మోహాలు విడిచి పెట్టాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండుటయే బౌద్ధ ధర్మం. సమాజం పట్ల భాద్యతగా ఉండాలి. మంచికి ప్రతినిధులుగా మారాలి అన్నారు. సిక్కు మత ప్రతినిధి శ్రీ సుభాని మాట్లాడుతూ గురు నానక్ సిక్కు ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసిన ధర్మ మార్గాన్ని సభకు తెలియ చేశారు.పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి వారితో మతాదిపతులు అందరూ చేతులు కలిపి దేశ సమగ్రత కొరకు విశ్వ శాంతి కొరకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా గారు ఆశ్రమ వాసులకు నూతన వస్త్రాలు, నిరుపేద మహిళలకు చీరలు, పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు పంపిణీ చేసి, మానవ సేవయే మాధవ సేవ గా ప్రతీ ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. మత ప్రతినిధులను పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి సత్కరించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని తుని కమిటీ సభ్యులు శాలువా కప్పి సత్కరించారు. శ్రీ చిటికెల సత్యనారాయణ గారు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో తుని కమిటీ శ్రీ NTV ప్రసాద వర్మ, శ్రీ జంపన కేశవ రాజు, శ్రీ GVV సత్యనారాయణ,శ్రీ అబ్బిరెడ్డి అప్పన్న రెడ్డి, శ్రీ గోసుల రమణ, శ్రీ గొర్ల ఆదినారాయణ, శ్రీ కొండి వెంకట అప్పారావు , పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు పాల్గొన్నారు . నోబుల్ ITI correspondent శ్రీ గోసుల సత్యనారాయణ అతిథులకు ఆహ్వానం పలుకగా, శ్రీ చిటికెల సత్యనారాయణ వందన సమర్పణ చేశారు. ఈ సభలో 90 మంది పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి నుండి మహా మంత్రోపదేశం పొందారు. సుమారు 3,000 మంది సభకు హాజరు కాగా అందరికీ ఉచిత భోజన సౌకర్యం కల్పించారు.
ఇట్లు
శ్రీ GVV సత్యనారాయణ,
ఆశ్రమ శాఖ ,Tuni.

You may also like...