ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 184| 26th July 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 184

వక్తలు :

  1. శ్రీమతి తోలేటి సుగుణ కుమారి, యానాం
  2. శ్రీమతి బుద్ధరాజు రాధా మాధవీలత, భీమవరం

377 వ పద్యం
ఉ. సోదెలు చెప్పువారి కడు సూక్ష్మవిధానమె “మెస్మరిస్టు”లా
మోదమునన్ గ్రహించి పరిపూర్ణులఁబోలె యదృశ్యవిద్య మ
ర్యాద భవిష్యదర్థముల నారయుచుందురు యోగమార్గ వి
ద్యాదయితా స్వరూపమున హాయనముల్ పదునాల్గు లోకముల్

378 వ పద్యం
సీ. సన్యాసు లున్న విజ్ఞానసాధనమహా
సంపత్తి నాత్మ లేశంబు లేదు
విద్వాంసులున్న ప్రావీణ్యలావణ్య సం
భరిత జితేంద్రియత్వంబు లేదు
ధనికులున్నను జీవిత విధానమునను మ
ర్యాదయు దానధర్మంబు లేదు
వక్తలు నున్న ప్రపత్తి శాంతాన్విత
ప్రాభవోపేతవర్తనము లేదు
తే.గీ. గడుసు వేదాంతశాస్త్రార్థ గరిమ యున్న
నిద్ధ సంగపరిత్యాగ సిద్ధిలేదు
కాన చెట్లున్న ఫలములు లేనియట్లు
పుణ్యశూన్యులు మోక్షంబు పొందలేరు.

You may also like...