ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 185| 02nd August 2025
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 185
వక్తలు :
- శ్రీమతి అల్లం జ్యోత్స్న, ఏలూరు
- శ్రీమతి కోదాటి సంధ్యాదేవి, తొర్రేడు
379 వ పద్యం
ఉ. బుద్ధుఁడు పెద్ద కాలము ప్రబోధమతిన్ దప మాచరించి స
ద్భుద్ధిని చల్ది మజ్జిగను బోసి భుజింపఁగఁ జూచి శిష్యులా
పద్ధతి భగ్న సంస్కరణభావ మటంచును లేచిపోయి రా
బద్ధ జితేంద్రియత్వమును బాసె నటంచును నింద సేయుచున్.
380 వ పద్యం
మ. వ్రతముల్ సంధ్యల సోమపానముల దివ్యత్వంబు రా నేర్చునో
బ్రతుకున్ జీర్ణముచేసి యీశ్వరుని నారాధించి యీ స్వర్గమున్
హితమున్ మోక్షము వచ్చునో యెటులనైతే నేమి నిశ్శేష శా
శ్వత విద్యుత్ప్రతిభావిభాసమగు జీవత్వాప్తి దర్శింపుమా.