ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 204| 13th December 2025

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 204

వక్తలు :

  1. శ్రీ సాగి బుచ్చి వెంకట నరసింహ రాజు, విశాఖపట్నం
  2. శ్రీమతి సత్తిరాజు శ్రీలక్ష్మి, భీమవరం

418 వ పద్యం
ఉ. పాపము పుణ్య మంచుఁ బరిపాటిగఁ జెప్పెడు మాటలందు నీ
చూపు పదార్థవాదములఁ జూచుచునున్నది ఖేద మోదమం
దా పరమార్థ వాదము పరాపరమైన త్వదాత్మ మోక్షపున్
రూపము దాల్పదేని యదె రూఢిగ పాపము వేరయున్నదే.

419 వ పద్యం
ఉ. ఊహలు వానిలోఁ గలుగు నున్నతమార్గము సున్న యున్న సం
దేహము బాయకున్న మఱి తేరుట యెట్లని తోఁచెనేని నీ
దేహమునందు జీవుఁడను తెల్వియు స్వప్నములందు నీవు నీ
మోహన విగ్రహంబుఁ గని పోల్చఁగలేవొకొ నీ రహస్యమున్

You may also like...