Dr. Umar Alisha visited Pranav Ashram, Koppavaram on 04th January 2022

ప్రెస్ నోట్
నిత్య సాధన ద్వారా పరిపూర్ణ మానవునిగా పరిణామం చెందవచ్చు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహభాషణ చేశారు. 04 జనవరి 2022 మంగళవారం మధ్యాహ్నం స్థానిక కొప్పవరం గ్రామంలో ప్రణవ ఆశ్రమంలొ ధ్యాన సాధన ఈశ్వరత్వము అనే అంశం పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రణవ ఆశ్రమం నిర్వకురాలు శ్రీమతి ప్రభావతి గారు సభకు అధ్యక్షత వహించగా, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ శరీరము, మనస్సు, ఆత్మల సమ్మేళనమే మానవుడిని అన్నారు. శరీరానికి భుక్తి, మనస్సుకు తృప్తి, ఆత్మకు ముక్తి పొందాలంటే ప్రతీ మానవుడు మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనే త్రైయీసాధన నిర్వహించాలని అన్నారు. ఆత్మ ధ్యాన సాధన ద్వారా చైతన్యవంతమైన శక్తి స్వరూపంగా పరిణామం చెందితే, తద్వారా మనస్సు జ్ఞాన సాధన ద్వారా చైతన్య వంతమై తృప్తిగా, మనశ్శాంతిగా సమాజంలో జీవించవచ్చు అని, మంత్ర సాధన ద్వారా శరీరంలో వేలాది కోట్లాది జీవాణువులలో జీవ చైతన్య శక్తి ప్రసరించబడి, శరీరానికి భక్తిని పొంది, మానవ జన్మ సార్దక్యమగునని డా. ఉమర్ ఆలీషా ప్రసంగించారు. శారీరక మానసిక తత్వాలలో ఆత్మ చైతన్యవoతమైన శక్తిగా ఉన్నది. ప్రతీ రోజు కొంత సమయం త్రైయీసాధనకు కేటాయించి మానవ జన్మ ఇహంలోను, పరంలోను సార్దక్యత పొందేలా కృషి చేయమని చెప్పారు. చక్కటి ధ్యాన సాధన నిర్వహిస్తున్న ప్రభావతీ గార్ని స్వామి శాలువ కప్పి సత్కరించారు. శ్రీమతి ప్రభావతి గారు స్వామి వారిని సాదరంగా అహ్వానించి, శాలువాతో సత్కరించి, నుతన వస్త్రాలు, ఫలాలు బహూకరించారు. ప్రణవ ఆశ్రమంలో శిష్యులంతా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు నిర్వహించారు. పీఠం కమిటీ సభ్యులు శ్రీ సలాది రమేష్ గారు, శ్రీ పెద్దబాబు గారు, శ్రీ ఏ.వి.వి సత్యనారాయణ గారు, శ్రీ పేరురి సూరిబాబు గారు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ పేరురి సూరిబాబు,
పీఠం కన్వీనర్

You may also like...