సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022

సద్గురువర్యులచే జగద్గురు శ్రీకృష్ణుల వారి విగ్రహ ప్రతిష్ట, కాకినాడ 19 మార్చి 2022

జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ గీతా సందేశం ప్రతీ ఒక్కరూ దైనందిన జీవితం లో ఆచరిస్తే దేశ సమగ్రత, విశ్వ శాంతి ఏర్పడుతుంది అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. శనివారం ఉదయం కాకినాడ భానుగుడి వద్ద గల రంగ రాయణం అపార్ట్మెంట్ అవరణ లో పాలరాతి తో నిర్మించబడిన శ్రీకృష్ణ పరమాత్మ మందిరాన్ని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించగా, జె.యెన్.టి.యు వి.సి శ్రీ జి.వి.అర్ ప్రసాద రాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ మంత్రి వర్యులు శ్రీ కె.కన్నబాబు గారి తండ్రి శ్రీ కురసాల సత్యనారాయణ గారు కూడా శ్రీకృష్ణ పరమాత్మ మందిరాన్ని దర్శించి, పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారి, ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని రంగ రాయణం అపార్ట్మెంట్ వాస్తవ్యులు అందరూ శాలువ కప్పి, గజమాలతో ఘనంగా సత్కరించారు.
అపార్ట్మెంట్ అధ్యక్షులు శ్రీ తిక్కం రామచంద్రరావు మరియు శ్రీ దాట్ల రామచంద్ర రాజు దంపతులు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పీఠం కమిటి సభ్యులు శ్రీ పేరూరి సూరిబాబు గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద వర్మ గారు, శ్రీ ఎ.వి.వి సత్యనారాయణ గారు, శ్రీ సలాది రమేష్ గారు, కార్పొరేటర్ శ్రీ వీరేంద్ర గారు పాల్గొన్నారు .
పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి మాట్లాడుతూ ప్రతీ రోజు ఉదయం 30 నిమిషాలు, రాత్రి 30 నిమిషాలు శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించిన గీతా శ్లోకాలను మననం చేసుకోవడం ద్వారా, దైనందిన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆపదలు, అనారోగ్యాల నుండి కాపాడబడి, జీవాత్మ పరమాత్మ గా పరిణామం చెందునని అన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్

https://www.facebook.com/269659813156123/posts/4687323701389690/

https://www.youtube.com/post/UgkxynWaR_TfQHoJI4P-4HYUD7be_UUw5EUW

You may also like...