23 జనవరి 2022 న స్థానిక కాకినాడ బోట్ క్లబ్ ప్రాంగణంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి 77వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడినది

ప్రెస్ నోట్
తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకోవాలని మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న పిలుపు నిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ ప్రాంగణంలో కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహ ప్రాంగణంలో ఏర్పాటు చేయ బడిన 77 వ వర్ధంతి కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ నగర మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న, శ్రీ సుంకర విద్యాసాగర్ దంపతులు, DSP శ్రీ భీమా రావు, CI శ్రీ ఆకుల మురళీ కృష్ణ, కార్పొరేటర్ శ్రీ కంపర బాబీ ముఖ్య అతిధులగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా మేయర్ శ్రీమతి సుంకర శివ ప్రసన్న, విద్యాసాగర్ దంపతులు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విశ్వ ప్రార్థన లో పాల్గొన్నారు. శ్రీమతి సుంకర శివ ప్రసన్న మాట్లాడుతూ మాతృ భాష ఉర్దూ అయినా, ఉమర్ ఆలీషా గారు తెలుగులో 50 కి పైగా గ్రంధాలు రచించారు. వారి స్పూర్తితో మన మంతా మన పిల్లలకు తెలుగు నేర్పి, తెలుగు భాష ను పరిరక్షించు కోవాలని పిలుపు నిచ్చారు. శ్రీ సుంకర విద్యా సాగర్ మాట్లాడుతూ మత సామరస్యం, మానవతా విలువలు బోధించు ఉమర్ అలీషా గారి ప్రభోదాలు ఆచరణీయం అని అన్నారు. DSP శ్రీ భీమా రావు గారు మాట్లాడుతూ వజ్ర సమానుడు డా ఉమర్ ఆలీషా, బహుముఖ వ్యక్తిత్వం, మహా పండితుడు అని కొనియాడారు. కార్పొరేటర్ శ్రీ కంపర బాబీ మాట్లాడుతూ ఈనాడు స్త్రీ వాదులు చెబుతున్న సంస్కరణలు, ఉమర్ అలీషా గారు 100 సంవత్సరాల క్రితమే వారి రచనల ద్వారా తెలియ చేసారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కమిటీ సభ్యులు శ్రీమతి మండా ఎల్ల మాంబ, శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి, శ్రీమతి రెడ్డి సూర్య ప్రభావతి, శ్రీమతి వనుము మణి పక్షులకు ఆహారం నిమిత్తం వరి కంకులు విగ్రహం దగ్గర ఉన్న చెట్లకు వెళ్ళాడదీసారు. హారతి అనంతరం సభ్యులు COVID నిభందనలు పాటిస్తూ స్వామి వారికి నమస్కరించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి సహకరించిన శ్రీమతి మేడిసెట్టి లక్ష్మీ గార్కి మేయర్ శివ ప్రసన్న గారు ప్రసాదం అందచేశారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
కన్వీనర్.
98489 21799

News Papers

ఆంధ్రజ్యోతి దినపత్రిక

You may also like...