ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 105| 20th January 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 105
వక్తలు :

  1. శ్రీమతి తిరుమలరాజు లక్ష్మి పల్లవి, విశాఖపట్నం
  2. శ్రీమతి కుచ్చర్లపాటి గౌరీ ప్రియా, హైదరాబాద్

217 వ పద్యము
శా. ఏదో పెద్ద నిగూఢమైన నిజమిందేదో ప్రదీపించు నీ
యాదర్శైకరసాత్మక ప్రకృతి నధ్యాహారమందీ నృత
ప్రాదుర్భావము గల్గుచున్నది జగత్ప్రామాణ్యమందాస్తికో
ద్భేదంబైన నభౌతికప్రకృతి నుద్దీపించు తత్త్వంబునన్.

218 వ పద్యము
శా. ఏదో పెద్ద నిగూఢమైన నిజమెంతే తోఁచు నధ్యాత్మనా
పాథోరాశి తరంగవేగములచేఁ బాతాళమున్ జొచ్చి యం
దేదో జ్వాలగ నావరింప నభమం దేతెంచి విశ్వంబు దా
నై దివ్యామృతమోక్షధామములు సంధ్యారాగమం దారయన్.

You may also like...