ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 110| 24th February 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 110

వక్తలు :

  1. శ్రీ త్సవటపల్లి సాయి వెంకన్నబాబు, భీమవరం
  2. శ్రీమతి వనపర్తి మాధురి, విశాఖపట్టణం

227 వ పద్యము
మధువును ద్రావి త్రావి యల మైకమునందు విధూతవాక్సుధా
మధురములైన సత్కవితమార్గములన్ దలపోసి పోసి యా
పథికుఁడు సృష్టిలోపలి ప్రభావములన్ గనునట్లు నీవు నీ
పథమునఁ దత్త్వమున్ దెలిసి పాడుము నీ స్వకపోలగీతముల్.

228 వ పద్యము
ప్రార్థనఁ జేసి చేసి పడరాని శ్రమల్ పడి పొందుచున్న నీ
నిర్ధనమైన సంగతికి నేరని రీతికి వింత తోఁచు వా
గర్థముభంగి ప్రార్థన మహాఫలమియ్యనిదేని యేల నీ
స్వర్ధుని నమ్మ బోఁకు నిజసంగతి నేర్చితటంచు మూర్ఖతన్.

You may also like...