ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 114| 23rd March 2024

షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”

“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 114

వక్తలు :

  1. శ్రీమతి జంపాల సుహాసిని, హైదరాబాద్
  2. శ్రీమతి పావురాల ఉష, మలేషియా

235 వ పద్యము
బ్రతికెడు కొన్నినాళ్ళు నుపవాసములన్ దెగమాడెదేల యీ
బ్రతుకు నశించితే తిరిగి వచ్చెదవే యిది యారగింప ను
ద్ద్వితమతి నున్న నాళ్లనుభవింపుము హాయిగ విశ్వవస్తు వాం
ఛితములు లభ్యముల్ విధినిషేధములేమి పవిత్రుఁడౌ నెడన్.

236 వ పద్యము
ఎవరిని గొల్చెదీ వచట నేమియు లేదు ప్రపంచమెల్ల నీ
యువిదను బోల్చి యామె వివిధోర్ధ్వజగంబులుగాఁగ నెంచి యా
ప్రవిమల తేజమందు జడభావము వెట్టక చూచెదేని యీ
రవియు సుధాకరుండు దివి రాజిలు ప్రేమరసాన నైక్యమై.

You may also like...