ప్రజ్ఞానం బ్రహ్మ | సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు | Episode – 124| 1st June 2024
షష్ట పీఠాథిపతి బ్రహ్మర్షి శ్రీ ఉమర్ ఆలీషా వారి సూఫీవేదాంత దర్శము అంతర్జాల సదస్సు “ప్రజ్ఞానం బ్రహ్మ”
“ప్రజ్ఞానం బ్రహ్మ” ఎపిసోడ్ – 124
వక్తలు :
- శ్రీమతి సత్తి రమ్యసుధ, గోరఖ్పూర్
- శ్రీమతి దాసం మాధవి, ఉరదాళ్లపాలెం
255 వ పద్యము
నీకును మట్టిబొమ్మకును నేమిటి భేదము జీవచేతనా
లోకన మున్నదన్న నది లుప్తము జెందును మత్తు మందుచే
నీకరణిన్ జరాచరము లేకముగాఁ గనుపించుఁ గాని యే
దో కనుపించకున్నదది యుత్తదొ మాయయొ ఈశ్వరుండొకో.
256 వ పద్యము
హేమము సేయువారు రసమింగలమందు హరించకుండనే
మేమొ మహౌషధీశతము లేర్చినయట్లు రసస్వరూప వి
ద్యామహితాత్మకప్రకృతికై తనలోన జడత్వమేర్చి ని
ష్కామసమాధిలో మనసు గట్టినవారలె సిద్ధులారయన్.